Krithi Shetty: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కృతి శెట్టి(Krithi Shetty). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే క్రేజ్ ని సంపాదించుకోవడం అనేది చిన్న విషయమైతే కాదు. ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఉప్పెన’ చిత్రం ఒక సెన్సేషన్. ఈ సినిమా తో ఆమె ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. వరుసగా రెండు మూడు హిట్ సినిమాలు చేసింది కానీ, ఆ సక్సెస్ జోరుని కొనసాగించడం లో విఫలం అయ్యింది. తెలుగు లో ఆమె చివరిసారిగా కనిపించిన చిత్రం ‘మనమే’. శర్వానంద్ హీరో గా నటించిన ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె ఎక్కువగా తమిళ సినిమాల పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసింది.
అందులో ఒక సినిమా ‘వా..వాతియార్’ ఈ నెల 12న విడుదల కాబోతుంది. తెలుగు లో ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్న కృతి శెట్టి, అందులో భాగంగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో ఆమె పాత్ర గురించి మాట్లాడుతూ , షూటింగ్ సమయం లో నిజమైన దెయ్యం తో తనకు ఎదురైనా అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ‘ఈ చిత్రం లో నేను ఆత్మలతో మాట్లాడే జీపీసీ యువతీ పాత్రలో నటించాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నాకు ఒక వింతైన అనుభవం కలిగింది. నేను ఒక హోటల్ లో మా అమ్మతో కలిసి బస చేస్తున్నాను. ఆ సమయం లో ఒక ఆత్మా రూపం నాకు దర్శనమిచ్చింది. లైట్లు ఆన్ చేయగానే పెద్ద శబ్దం వినిపించింది, ఆ రూపం కూడా మాయమైంది. ఒంటరిగా నేను ఆరోజు ఉండుంటే నా గుండెలు ఆగిపోయేవి. కానీ పక్కనే మా అమ్మ ఉండడం తో ఎలాంటి భయం లేకుండా పడుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.
ఇకపోతే ఈ సినిమాతో పాటు ఆమె ప్రదీప్ రంగనాథన్ తో కలిసి ‘LIK’ అనే చిత్రం లో కూడా నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 18 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ మేకర్స్ మరోసారి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే కృతి శెట్టి రాబోయే ఈ రెండు సినిమాలతో భారీ హిట్స్ ని అందుకునేలాగానే కనిపిస్తోంది. చూడాలి మరి ఇకపై ఆమె కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.