Krithi Shetty Film Career: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మలు సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు వీళ్ళు పలు యాడ్స్ లో కూడా నటించి బాగా పాపులర్ అయ్యారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ ఒకప్పుడు తన తొలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ హిట్ అందుకుంది. తొలి సినిమా రిలీజ్ కి ముందే ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీ లో తొలి సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తొలి సినిమాతో కొంతమంది ముద్దుగుమ్మలు భారీ క్రేజ్ తెచ్చుకోవడంతో ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగించడం గ్యారెంటీ అని చాలామంది అభిమానులు అనుకుంటారు. కానీ ఊహించని విధంగా కొంతమంది మాత్రం తొలి సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఆ తర్వాత మాత్రం కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారు. అడపాదడపా సినిమాలలో మాత్రమే నటించి సినిమా ఇండస్ట్రీకి దూరం కూడా అయ్యారు. ప్రస్తుతం ఓ యంగ్ బ్యూటీ కూడా టాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాలోనే హీరోయిన్గా తన అందంతో, నటనతో యూత్ ను తన వైపు తిప్పుతుంది. ఈ యంగ్ బ్యూటీ మరెవరో కాదు కృతి శెట్టి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఉప్పెన భారీ హిట్ సినిమా తర్వాత తెలుగులో కృతి శెట్టి నటించిన ఒకటి రెండు సినిమాలు తప్పించి మిగిలినవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందాయి. దీంతో క్రమంగా కృతి శెట్టి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. మనమే అనే తెలుగు సినిమాలో చివరిగా కృతి శెట్టి నటించింది. కానీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కృతి శెట్టి చేతిలో ఎల్ ఐ కే, జీని సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఆమె ఆశలు అన్నీ కూడా ఈ రెండు సినిమాల మీదనే పెట్టుకుంది. మలయాళం లో కూడా కృతి శెట్టి తొలి సినిమాతో మంచి ప్రశంసలు అందుకుంది. సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ సామాజిక మాధ్యమాలలో మాత్రం తన గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఇకపై సినిమాలలో గ్లామర్ విషయంలో ఎటువంటి లిమిట్స్ లేకుండా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది.