Star Heroine Sheela receives Guinness record: మనం చెప్పుకోబోయే ఈ స్టార్ హీరోయిన్ కూడా అతి తక్కువ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకుంది. ఈ స్టార్ హీరోయిన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. అలాగే ఒకే ఒక్క హీరోతో 130 సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన జంటలలో ఈ జంట కూడా ఒకటి. అప్పటి ఈ జంటను ఇప్పటి ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ కలిసి చరిత్ర సృష్టించారు. వీరి కాంబినేషన్లో ఏకంగా 130 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 130 సినిమాలలో ఏకంగా 50 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. దీంతో ఈ జంటకు గిన్నిస్ రికార్డుల గుర్తింపు వచ్చింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు చంద్రముఖి సినిమాలో అఖిలాండేశ్వరి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన షీలాసిలిన్ అక్క షీలా.
ఈమె మలయాళీ నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెతో కలిసి నటించిన హీరో ప్రేమ్ నజీర్. వీరిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పట్లో 130 సినిమాలలో వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా కట్టుమైనా అనే సినిమాలో నటించారు. 1963 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారి విజయం సాధించింది. ఇక తర్వాత చాలా ఏళ్లు వీళ్ళిద్దరూ కలిసి సినిమాలలో పనిచేశారు. దాంతో వీరిద్దరి పేరు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కింది. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సెమ్మియిన్, కళ్లి చెల్లెమ్మ, వెలుతా కత్రినా వంటి సినిమాలు క్లాసిక్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. నటి షీలా 1948, మార్చి 24న జన్మించారు. 13 సంవత్సరాల అతి చిన్న వయసులో షీలా సినిమా ఇండస్ట్రీలో నటన ప్రారంభించారు.
17 సంవత్సరాల అతి చిన్న వయసులో ఎంజీఆర్ తో కలిసి 1962లో పాశం అనే తమిళ సినిమాలో వెండితెరపై కనిపించారు. తమిళ్, మలయాళం తోపాటు, తెలుగు మరియు ఉర్దూ భాషలలో కూడా 475 కు పైగా సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా రాణిస్తూనే దర్శకురాలిగా కూడా షీలా మెప్పించారు. షీలా యక్షగానం, సికారాంఘల్ అనే సినిమాలకు స్వయంగా స్క్రీన్ ప్లే రాసి ఆమె దర్శకత్వం కూడా వహించారు. తన నటనకు గాను నాలుగు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అలాగే జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత నటన నుండి 1983లో రిటైర్ అయ్యి పోటీలో ప్రస్తుతం సెటిల్ అయ్యారు.