Krishnamma Movie Twitter Talk: మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ కృష్ణమ్మ. కృష్ణమ్మ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ ప్రజెంట్ చేయడం మరొక విశేషం. మాస్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన కృష్ణమ్మ థియేటర్స్ లోకి వచ్చేసింది. మే 10న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. కృష్ణమ్మ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తున్న తరుణంలో… మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
కృష్ణమ్మ చిత్రానికి వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. అర్చన హీరోయిన్ గా నటించింది. కృష్ణ బూర్గుల, అతిర రాజ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలు చేశారు. కృష్ణ చిత్ర కథ విషయానికి వస్తే… ఓ ఊరిలో ఉన్న జనం మీద వెయ్యికి పైగా కేసులు ఉంటాయి. వివిధ కారణాలతో వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటారు. అనుకోకుండా సత్యదేవ్ తో పాటు తన ఇద్దరు మిత్రులు ఒక కేసులో ఇరుక్కుంటారు. అక్కడి నుండి వాళ్ళ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.
సినిమా ఎలా ఉదంటే… ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఊరమాస్ రోల్ లో సత్యదేవ్ మెప్పించాడు. సత్యదేవ్ నటన చాలా సహజంగా ఉంటుంది. ఆ పాత్రకు చక్కగా సరిపోయాడన్న టాక్ వినిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ కూడా కొత్తగా ఉందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. సపోర్టింగ్ క్యాస్ట్ సినిమాకు ప్లస్ అయ్యిందని ఆడియన్స్ అభిప్రాయం.
అయితే కథనం అంతగా ఆకట్టుకోదు. కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. కథను ఆసక్తికరంగా నడపడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. మ్యూజిక్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. సత్యదేవ్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ కొరకు సినిమా చూడొచ్చని కృష్ణమ్మ సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే కృష్ణమ్మ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు.