https://oktelugu.com/

Dhanush Son: ఇంటర్ లో టాపర్ గా నిలిచిన ధనుష్ కొడుకు…ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..?

ధనుష్ పెద్దకొడుకు అయిన రాజా యాత్ర రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో చాలా అద్భుతమైన మార్కులను సాధించాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 12:14 PM IST

    Dhanush eldest son Yatra 12th class marks

    Follow us on

    Dhanush Son: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న నటుడు ధనుష్…ఇక ఇప్పుడు ఈయన వరుస గా సినిమాలను లైన్ లో పెడుతూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అది ఏంటి అంటే ధనుష్ పెద్దకొడుకు అయిన రాజా యాత్ర రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో చాలా అద్భుతమైన మార్కులను సాధించాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

    ఇక రాజా యాత్రకి 600 మార్కులకు గాను 569 మార్కులు వచ్చాయట. ఇక దీంతో పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రాజా యాత్రకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక అలాగే ధనుష్ అభిమానులు కూడా రాజా యాత్ర విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు… ఇక ఇదిలా ఉంటే ధనుష్ మాత్రం ఎక్కడా కూడా తన కొడుకుకి ఇంటర్ లో ఇన్ని మార్కులు వచ్చాయని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. దాంతో రాజా యాత్రకి నిజంగానే ఇంటర్లో అన్ని మార్కులు వచ్చాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…

    ఇక ఇదిలా ఉంటే ధనుష్ ఐశ్వర్య లు 2004 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్ళు 18 సంవత్సరాలు కలిసి అన్యోన్యంగా ఉన్నారు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు. ఇక వీళ్ళకి రాజా యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పెద్దకొడుకుకి 18 సంవత్సరాలు ఉండగా, చిన్న కొడుక్కి 14 సంవత్సరాలు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఐశ్వర్య ధనుష్ లు ఒకరి విషయాల్లో మరోకరు జోక్యం చేసుకోవడం లేదు. వీళ్లలో ఎవరికి సంబంధించిన ఈవెంట్ జరిగిన కూడా వీళ్ళిద్దరైతే హాజరు కావడం లేదు.

    ఇక దాంతో వీళ్ళు మళ్ళీ కలిసే అవకాశాలు లేవు అంటూ చాలామంది పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇదంతా పట్టించుకోకుండా ధనుష్ మాత్రం వరుస సినిమాలను చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీదనే ప్రస్తుతం ఆయన భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…