Prabhas disaster movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్… ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులైతే కొట్టేశాడు. వర్షం సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘చత్రపతి’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఒకానొక సమయంలో మాస్ లో ప్రభాస్ కి భారీ క్రేజ్ వచ్చింది. ఇక తనను మించిన నటుడు మరెవరు లేరు అనేంతలా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కానీ చత్రపతి సినిమా తర్వాత ఆయనకి ప్రభుదేవా పౌర్ణమి సినిమా కథ చెప్పడంతో ప్రభాస్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ సినిమా కథ విన్న తర్వాత కృష్ణంరాజు ఈ కథలో అంత పెద్ద మ్యాటర్ లేదని చత్రపతి సినిమా చేసిన తర్వాత ఇలాంటి సినిమా చేయడం కరెక్ట్ కాదని చెప్పారట. అయినప్పటికి ప్రభాస్ మాత్రం ప్రభుదేవా కి మాట ఇచ్చాడు. కాబట్టి ఆ సినిమా చేస్తానని కృష్ణంరాజుతో చెప్పారట… ఇంక దాంతో కృష్ణరాజు కూడా చేసేదేమీ లేక ఓకే చెప్పాడట. మొత్తానికైతే ఆ సినిమా డిజాస్టర్ గా మారింది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి ఆ సినిమా తర్వాత నుంచి వరుసగా ప్లాప్ లు రావడంతో ఆయనకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి అలాంటి సినిమాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికి ఆ సినిమా అనుకోకుండా రావడం ప్రభాస్ కెరియర్ ను మరింత డౌన్ ఫాల్ చేసిందనే చెప్పాలి.
ఇక బుజ్జిగాడు, డార్లింగ్ సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించిన ప్రభాస్ అప్పటివరకు ప్లాప్ లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది… ఇక ప్రస్తుతం ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా ను షేక్ చేసే సినిమాలను చేస్తున్నాడు. తొందర్లోనే పాన్ వరల్డ్ లో సైతం అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు…