Kollywood Directors: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా నిలిచింది… మన వాళ్ళు చేసే సినిమాలన్నీ ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తుండటం విశేషం…ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు మన తెలుగు హీరోలకి వస్తుండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక తమిళ్ డైరెక్టర్లు సైతం అక్కడున్న హీరోలతో సినిమాలను చేసి భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. కాబట్టి వాళ్లు వరుసగా మన తెలుగు హీరోల మీద కన్నేస్తున్నారు. ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తుండగా లోకేష్ కనకరాజు సైతం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్లోతెరకెక్కిస్తుండటం విశేషం… ఇక వీళ్ళతో పాటుగా నెల్సన్ సైతం గత కొన్ని రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతో మంతనాలైతే జరుపుతున్నాడు. వీళ్ళ ముగ్గురిలో ఏదో ఒక హీరోతో ఆయన తన నెక్స్ట్ సినిమాని చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే రజనీకాంత్ తో ‘జైలర్ 2’ ని చేస్తున్న ఆయన వీలైనంత తొందరగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందో అప్పటినుంచి తెలుగు హీరోతో ఒక సినిమాని స్టార్ట్ చేసి ఆ సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఆయన అనుకున్నట్టుగానే తెలుగు హీరోలు అతనికి అవకాశాన్ని ఇస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ళతో పాటుగా గత కొన్ని రోజుల నుంచి లింగు స్వామి సైతం తెలుగు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయన రామ్ ను హీరోగా పెట్టి ‘వారియర్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అతన్ని తెలుగు హీరోలేవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక మరోసారి తెలుగు హీరోతో సినిమాలు చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…