https://oktelugu.com/

Ninne Pelladatha: నిన్నే పెళ్ళాడతా సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ…

కృష్ణవంశీ నిజాయితీ కి నాగార్జున అభిమానులందరు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఆ హీరోతో సీక్వెల్స్ అవసరం ఉన్న లేకపోయిన తీసి ఆ హీరోలకి మళ్ళీ ప్లాపులు ఇస్తున్న క్రమంలో...

Written By:
  • Gopi
  • , Updated On : March 4, 2024 / 09:47 AM IST

    Ninne Pelladatha sequel

    Follow us on

    Ninne Pelladatha: అప్పట్లో తెలుగు లో ఉన్న అతి కొద్ది మంది డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు.ఇక క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ముఖ్యంగా ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద జనాల్లో భారీ అంచనాలు ఉండేవి. ఇక ఆయన సినిమా నుంచి ఒక పోస్టర్ బయటికి వచ్చింది అంటే ఆ సినిమా ఎలాంటి జానర్ కి సంబంధించిందో చూసి ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకునేవారు.

    అలా ఆయన సినిమా సినిమాకి జానర్లు చేంజ్ చేస్తూ ఒక జానర్ కి స్టిక్ అవ్వకుండా ప్రతి జానర్ లో తన సత్తా చాటాలని చూస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే నాగార్జునతో(Nagarjuna) చేసిన నిన్నే పెళ్ళాడుతా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీని కొంతమంది అభిమానులు నిన్నే పెళ్లాడతా సినిమాకి సీక్వెల్ ను నాగ చైతన్య తో తీయచ్చు కదా సార్ అని అడగగా, ఆయన దాని మీద స్పందిస్తూ సీక్వెల్స్ మీద నాకు పెద్దగా మంచి అభిప్రాయం అయితే లేదు. ఎందుకంటే ‘ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత దాని ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి సీక్వెల్ తీస్తాం. అలా ఒకసారి ఎండ్ అయిపోయిన కథని మళ్లీ లాగడం అనేది నాకు నచ్చదు. అందుకే నేను సీక్వెల్స్ అయితే చేయను’ కావాలంటే నాగచైతన్యతతో ఒక ఫ్రెష్ స్టోరీ తో సినిమా చేస్తానంతే తప్ప సీక్వెల్ సినిమా చేయనని కృష్ణవంశీ చాలా క్లారిటీగా చెప్పాడు.

    ఇక దీంతో కృష్ణవంశీ నిజాయితీ కి నాగార్జున అభిమానులందరు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఆ హీరోతో సీక్వెల్స్ అవసరం ఉన్న లేకపోయిన తీసి ఆ హీరోలకి మళ్ళీ ప్లాపులు ఇస్తున్న క్రమం లో కృష్ణ వంశీ మాత్రం ఇలా జన్యున్ గా ఉండటం అందరికీ బాగా నచ్చుతుంది.

    ఇక వంశీ వర్మ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఏ విషయాన్ని ఆయిన కుండబద్దలు కొట్టినట్టుగా మొహం మీదే మాట్లాడటం అలవాటు…అందుకే ఆయన ఏ విషయాన్ని అయిన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘ రంగ మార్తాండ ‘ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు మరొక సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…