NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన దైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన సినిమాలు మంచి గుర్తింపు సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేశాయి. ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తూ చాలా బిజీగా కొనసాగుతున్నప్పటికీ, ఇండస్ట్రీ లో ఆయన లాంటి నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ జనరేషన్ లో ఏ క్యారెక్టర్ అయిన సరే అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటులలో ఆయన ఒకరు.ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో ఆయనని ఒక హీరోయిన్ ప్రేమించిందనే విషయం చాలామందికి తెలియదు. ఆమె ఎవరు అంటే ఎన్టీయార్ తో పాటు నరసింహుడు , అశోక్ లాంటి సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి(Sameera Reddy)…ఈమె కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ ని విపరీతంగా ప్రేమించిందట, ఇక ఎన్టీఆర్ కూడా ఆమెని ప్రేమించినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నప్పటికీ దీనికి ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ మాత్రం నో చెప్పిందంట. దానివల్ల వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ అయినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ కనక ఓకే చెప్పినట్టు అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వారంటూ ఒకప్పుడు మీడియాలో వీళ్ళ మీద కథనాలు విపరీతంగా వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులకు కూడా జన్మనిచ్చాడు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ కెరియర్ పరంగా టాప్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ ఫ్యామిలీ పరంగా కూడా సెటిల్ అయ్యాడనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికనులతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కనక రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఎన్టీఆర్ స్టార్ డమ్ మరింత భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమా తో ఎన్టీయార్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో…