https://oktelugu.com/

Karate Kalyani: కక్షకట్టి నన్ను చంపాలని చూస్తున్నారని అంటున్న కరాటే కళ్యాణి… ఎవరంటే ?

Karate Kalyani: నటి కరాటే కళ్యాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ నటించిన కృష్ణ సినిమాలో బాబీ అనే డైలాగ్ తో ప్రేక్షకులను నవ్వించింది ఈమె. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఇక బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ప్రస్తుతం కళ్యాణి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటోంది. బీజేపీ నాయకురాలిగా పొలిటికల్ డిబేట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు కళ్యాణి. ఇదిలా ఉంటే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 / 11:17 AM IST
    Follow us on

    Karate Kalyani: నటి కరాటే కళ్యాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ నటించిన కృష్ణ సినిమాలో బాబీ అనే డైలాగ్ తో ప్రేక్షకులను నవ్వించింది ఈమె. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఇక బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ప్రస్తుతం కళ్యాణి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటోంది. బీజేపీ నాయకురాలిగా పొలిటికల్ డిబేట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు కళ్యాణి. ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణి తనకు ప్రాణ హాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

    ఇటీవల సినీ కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఓ హత్య కేసుకు సంబంధించి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను ఆవిడ బయట పెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లేంట్ దాఖలు చేయగా ఆమెపై కేసు నమోదు చేయాలని రంగా రెడ్డి కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ కరాటే కల్యాణి నిన్న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Also Read:  ‘గంటా’ స్కెచ్.. జనసేనాని పవన్ ను కింగ్ మేకర్ గా నిలబెడతాడట?

    హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ… కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని నేను బయట పెడుతున్నందుకు నాపై కక్ష కట్టి తనను హతమార్చాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకేమన్నా అయితే వాళ్ళే కారకులని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: చక్కటి ప్రేమాయణంలో ‘బిగ్ బాస్’ చిచ్చు.. అక్కడే షణ్ముక్, దీప్తి రిలేషన్‌కు బ్రేకులు..!