టాలీవుడ్లో అపజయాలు లేకుండా సినిమాలు తీసే కొంతమంది దర్శకుల్లో క్రిష్ ఒకరు. జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ తన తొలి చిత్రం ‘గమ్యం’తోనే ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక రెండో చిత్రంగా ‘వేదం’ సినిమాను తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొని టాలీవుడ్లో క్రియేటీవ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలోనే కృష్ణంవందే జగద్గురు.. కంచె.. గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. చారిత్రక, నవలా కథలను తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ దిట్ట అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న క్రిష్ తాజాగా పవన్ కల్యాణ్ తో ఓ మూవీ చేయబోతున్నాడు.
పవన్ కల్యాణ్ తో సినిమా కంటే ముందుగా దర్శకుడు క్రిష్ ఓ నవలాకు వెండితెరపై ప్రాణం పోసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో పలు దర్శకులు నవలా కథలను సినిమాలుగా తెరకెక్కిస్తూ విజయాలు అందుకుంటున్నాడు. దీంతో క్రిష్ కూడా ‘కొండపొలెం’ అనే నవలను తెరకెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
‘కొండపొలెం’తోపాటు ‘అతను అడవిని జయించాడు’ అనే నవలను క్రిష్ సినిమాగా తీయబోతున్నాడనే టాక్ విన్పిస్తోంది. క్రిష్ ముందుగా ‘అతడు అడవిని జయించాడు’ అనే కథను సినిమాగా తీద్దామని భావించాడు. అయితే ఎందుకోగానీ అతడి దృష్టి ‘కొండపొలెం’పై పడింది. దీంతో ముందుగా ‘కొండపొలెం’ నవల సినిమాగా రానుందని తెలుస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే ‘అతడు అడవిని జయించాడు’ అనే నవలా కూడా సినిమా రానుందని తెలుస్తోంది.