https://oktelugu.com/

నైజాంలో 42 కోట్లు పలికిన ఆచార్య !

మెగాస్టార్ ఆచార్య.. ఈ సినిమా మార్కెట్ ఫై కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాకు 42 కోట్లు కోట్ చేయడంతో దిల్ రాజు తనకు వద్దని అన్నాడట. దాంతో 42 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆచార్య నైజాం హక్కులను చేజిక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఆచార్య డీల్ భారీ ఎత్తున ఫిక్స్ అయింది. ఇప్పటికే మొత్తం 200 కోట్లు దాటేస్తోందని తెలుస్తోంది. ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మారని తెలుస్తోంది. సినిమాలో మెగాస్టార్ తో […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 02:59 PM IST
    Follow us on


    మెగాస్టార్ ఆచార్య.. ఈ సినిమా మార్కెట్ ఫై కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాకు 42 కోట్లు కోట్ చేయడంతో దిల్ రాజు తనకు వద్దని అన్నాడట. దాంతో 42 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆచార్య నైజాం హక్కులను చేజిక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఆచార్య డీల్ భారీ ఎత్తున ఫిక్స్ అయింది. ఇప్పటికే మొత్తం 200 కోట్లు దాటేస్తోందని తెలుస్తోంది. ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మారని తెలుస్తోంది. సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే

    పైగా పూజా హెగ్డేను కూడా హీరోయిన్ తీసుకున్నారు. అన్నిటికీ మించి కొరటాల శివ డైరక్షన్. అందుకే ఆచార్య మార్కెటింగ్ వ్యవహారం వందల కోట్లు దాటేస్తోందనేది తాజాగా వినిపిస్తోన్న టాక్. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయట. పైగా కొరటాల ఈ సినిమాలో ఓ కామెడీ ట్రాక్ ను పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయించారు. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read: ‘మహా నటి’ ఖాతాలో మరో అరుదైన ఘనత

    ఈ క్రమంలో .. ముందుగా యాక్షన్ లేని సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారని.. ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను తీస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్‌ లేకుండా వేదాళం షూట్ లో పాల్గొంటాడట. ఆచార్య వచ్చిన కేవలం రెండు నెలలకే వేదాళం రీమేక్‌ తో కూడా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏది ఏమైనా మెహర్‌ రమేష్‌ కెరీర్ కు ఈ సినిమా ఎంతో కీలకం. వరుస ఫ్లాప్‌ లతో ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్న మెహర్ రమేష్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్