తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌‌ ఫైర్‌‌..: బీజేపీ ప్లాన్‌ అదేనా..?

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌‌ తమిళిసై మరోసారి ఫైర్‌‌ అయ్యారు. ఇదివరకు కరోనా టైమ్‌లోనూ.. తదితర విషయాల్లోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆమె. తాజాగా.. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ల నియామకాలు జరగడం లేదంటూ ఆమె ఘాటు లేఖ రాశారు. తెలంగాణలోని11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ అయి రెండేళ్లు అవుతోంది. నియామకానికి 2019 జులైలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇంత వరకూ ఎవరినీ నియమించలేదు. దీనిపై కోర్టుల్లోనూ కేసులు పడ్డాయి. హఠాత్తుగా ఈ […]

Written By: Srinivas, Updated On : February 4, 2021 3:05 pm
Follow us on


తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌‌ తమిళిసై మరోసారి ఫైర్‌‌ అయ్యారు. ఇదివరకు కరోనా టైమ్‌లోనూ.. తదితర విషయాల్లోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆమె. తాజాగా.. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ల నియామకాలు జరగడం లేదంటూ ఆమె ఘాటు లేఖ రాశారు. తెలంగాణలోని11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ అయి రెండేళ్లు అవుతోంది. నియామకానికి 2019 జులైలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇంత వరకూ ఎవరినీ నియమించలేదు. దీనిపై కోర్టుల్లోనూ కేసులు పడ్డాయి. హఠాత్తుగా ఈ అంశంపై స్పందించిన తమిళిసై 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆదేశిస్తూ లేఖ పంపారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఓ ఘాటు లేఖ రాసి దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు.

Also Read: సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం..: కేంద్రంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర కీలకం మాత్రమే కాదు వివాదాస్పదం కూడా. దానికి బెంగాల్‌, కేరళ సహా పలు రాష్ట్రాలు ఉదాహరణగా నిలిచాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ఆ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ సర్కార్‌తో సన్నిహితంగానూ.. చంద్రబాబు సర్కార్‌తో వివాదాస్పదంగానూ వ్యవహరించేవారు. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించిన వారు కూడా ఫ్రెండ్లీ గవర్నర్లుగానే ఉన్నారు. ఎక్కడా బీజేపీ మార్క్ గవర్నర్‌లుగా వ్యవహరించలేదు. దీనికి కారణం బీజేపీ రాజకీయ వ్యూహాలే కారణం అని అనుకోవచ్చు.

అయితే.. ఇప్పుడు ఏపీ సంగతి అలా ఉంచితే.. తెలంగాణలో మాత్రం బీజేపీ రాజకీయాలు మార్చాలనుకుంటోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీతో ఎలాంటి లడాయి పెట్టుకోవాలనుకోవడం లేదు. కానీ.. బీజేపీ మాత్రం తెలంగాణలో పాగా వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వస్తే బెంగాల్ లాంటి పరిస్థితి వస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్ సైలెంటయ్యారు. అయితే బీజేపీ మాత్రం.. కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ ఉండదని ప్రకటనలు చేస్తున్నారు. ఆ క్రమంలో గవర్నర్ కూడా కాస్త ఘాటు లేఖలు రాయడం ప్రారంభించారు. వీసీల నియామకం కాకపోవడం వల్ల యూనివర్సిటీలు ఇబ్బందులకు గురవుతున్నాయని.. గవర్నర్ సొంతంగా ఆవేదనకు గురై లేఖ రాశారా అన్నదానిపై స్పష్టత లేదు.

Also Read: విశాఖ రైల్వేజోన్ కథ ముగిసినట్లేనా..?

గవర్నర్‌‌ తమిళి సై లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టీఆర్ఎస్‌ను పూర్తిస్థాయిలో టార్గెట్ చేయాలనుకుంటే.. తమిళిసై మరింత యాక్టివ్ అవడం ఖాయం అనుకోవచ్చు. ఒకవేళ బెంగాల్, కేరళ గవర్నర్‌‌లా రాజకీయం మార్చాలనుకుంటే మాత్రం తమిళి సైని తట్టుకోవడం కేసీఆర్‌కు.. టీఆర్ఎస్‌కు అంత తేలిక కాదు. ఎందుకంటారా.. ఆమె గవర్నర్‌‌ కాకముందే ఫైర్‌‌ బ్రాండ్‌ రాజకీయ నాయకురాలు. అందులోనూ రాజకీయం ఎలా చేయాలో కూడా ఆమెకు బాగా తెలుసు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్