Kothanodi Movie : ప్రాంతీయ సాంస్కృతిక నేపథ్యం లో వచ్చే సినిమాలు చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘కాంతారా'(Kanthara Movie). కర్ణాటక ప్రాంతంలోని కొన్ని తెగలకు సంబంధించిన నాగరికత ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. ఇలా ప్రాంతాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆధారంగా చేసుకొని 2015 వ సంవత్సరం లో ‘కొట్టానోడి'(Kothanodi Movie) అనే ఇండియన్ అస్సాం లాంగ్వేజ్ చిత్రం ఒకటి విడుదలైంది. అస్సాం గ్రామీణ ప్రాంతంలో నివసించే జనాలు, వాళ్ళ జీవనశైలి, మూఢనమ్మకాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం తేజిమోలా, చంపావతి, ఓఉ కువోరి, తావోయిర్ సాదు అనే నలుగురి చుట్టూ తిరుగుతుంది.
Also Read : నితిన్ ‘ఎల్లమ్మ’ నుండి సాయి పల్లవి అవుట్..కారణం ఏమిటంటే!
వాళ్ళ కథల విషయానికి వస్తే తేజిమోలా సవతి పోరుకి సంబంధించినది. నెనేహి అనే స్త్రీ తేజిమోలా పట్ల నిరంతరం అసూయతో రగిలిపోతూ ఉంటుంది. తేజిమోలా తండ్రి వ్యాపారం కోసం వేరే ఊరికి వెళ్ళినప్పుడు, నేనాహి తేజిమోలా ని చంపేందుకు కుట్రలు పన్నుతుంది. ఈ కథలో ఒక సవతి క్రూరత్వం, అదే విధంగా తేజిమోలా నిస్సహాయత స్థితి ని తెలియచేస్తుంది. ఇక ఓఉ కువోరి విషయానికి వస్తే, దేవీనాథ్ అనే వ్యక్తి తన ప్రయాణంలో కేతకి అనే స్త్రీని కలుస్తాడు. ఈ స్త్రీ జన్మ ఇతివృత్తం విచిత్రంగా ఉంటుంది. ఈమె ఒటెంగా అనే పండుకి జన్మిస్తుంది. ఈమె జన్మ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం లో ఉంటాడు. ఇక చంపావతి కథ విషయానికి వస్తే దోనేశ్వరి అనే సంపన్న స్త్రీ, ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశతో మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతుంది. అందులో భాగంగా ఆమె తన కూతురు భోన్లేటీకా ను ఒక పెద్ద కొండచిలువకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత ఆ కొండచిలువను శోభనం గదిలోకి కూడా పంపిస్తుంది.
ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు చూసే ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతి కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తావోయిర్ సాధు కథ విషయానికి వస్తే మాలతీ అనే మహిళా తన భర్త, మామయ్య ఇచ్చే ఆదేశాల మేరకు తన ముగ్గురు పిల్లలను బలి ఇస్తుంది. నాలుగో బిడ్డని ఎలా అయినా బ్రతికించుకోవాలని తపన పడే ఆమెకు ఒక దిగ్బ్రాంతికి గురి చేసే విషయం ఒకటి తెలుస్తుంది. ఏమిటి అనేది సినిమాని చూసి తెలుసుకోండి. ఈ చిత్రం సోనీ లైవ్(Sony Liv) యాప్ లో అందుబాటులో ఉంది. అస్సాం భాషలోనే ఈ చిత్రం ఉంటుంది కానీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉంది. మూవీ లవర్స్ కచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.