https://oktelugu.com/

Mohan Babu: కోతల రాయుడు పెదరాయుడు అవుతాడా ?

Mohan Babu: ఇండస్ట్రీ సమస్యలను ఎంతవరకు పరిష్కరిస్తున్నారో తెలియదు గానీ, ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అంటూ అనవసర చర్చలు పెడుతూ కాలయాపన మాత్రం చాలా బాగా చేస్తున్నారు. దీనికి తోడు మధ్యలో మోహన్‌ బాబు ఎక్కడా లైన్ పెద్దరికాన్ని ప్రదర్శించి ఓ బహిరంగ లేఖను పబ్లిక్ లోకి వదిలాడు. అయితే, మోహన్ బాబు లేఖ పై ఇప్పటికే అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ లేఖ పై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2022 / 03:50 PM IST
    Follow us on

    Mohan Babu: ఇండస్ట్రీ సమస్యలను ఎంతవరకు పరిష్కరిస్తున్నారో తెలియదు గానీ, ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అంటూ అనవసర చర్చలు పెడుతూ కాలయాపన మాత్రం చాలా బాగా చేస్తున్నారు. దీనికి తోడు మధ్యలో మోహన్‌ బాబు ఎక్కడా లైన్ పెద్దరికాన్ని ప్రదర్శించి ఓ బహిరంగ లేఖను పబ్లిక్ లోకి వదిలాడు. అయితే, మోహన్ బాబు లేఖ పై ఇప్పటికే అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ లేఖ పై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్‌ కూడా స్పందించారు.

    Mohan Babu

    సి. కల్యాణ్‌ ఏమి మాట్లాడాడు అంటే.. ‘ఇండస్ట్రీలోని సమస్యల పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూనే ఉంది. అయితే, నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబుగారు తన లేఖలో చెప్పారు. కానీ, మోహన్ బాబు గారు కూడా నిర్మాతే కదా. అలాగే ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా నిర్మాతే కదా.

    ఒకవేళ, ఈ సమస్యలను మోహన్ బాబుగారు ముందుండి పరిస్కరిస్తామంటే మేమంతా ఆయన వెంట నడుస్తాం, ఆయనతో పాటు ఉంటాం’ అంటూ సి. కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మరి మోహన్ బాబు అందర్నీ కలుపుకుని ముందుకు పోతాడా ? కలుపుకుని ముందు పోతే పని అవుతుందా ?, అసలు ఇవ్వన్నీ పక్కన పెడితే.. మోహన్ బాబు ఏదైనా చేయగలరా ?.. నిజానికి మోహన్ బాబు తన మాటలు నిక్కచ్చిగా కఠినంగా ఉంటాయని.. కానీ, నిజాలే మాట్లాడతాను అంటూ స్పీచ్ లు బాగా ఇస్తారు.

    ఆ స్పీచ్ ల్లో ఉండే క్లారిటీ ఆయన చేతల్లో మిస్ అవుతూ ఉంటుంది. మరి మోహన్ బాబు తన మాటల తూటాలను పక్కన పెట్టి.. వృద్ధ సింహంలా గర్జిస్తూ సినిమాలకు జరుగుతున్న అన్యాయం పై విరుచుకు పడితే.. ఆయన పెద్దరికాన్ని ఒక విలువ ఉంటుంది. అంతేగాని, ఎక్కువ చేస్తే చీరేస్తా.. చీరేస్తే కరిచేస్తా అంటూ మాటలు చెబుతూ లేఖలు వదిలితే ఎలాంటి ఉపయోగం ఉండదు.

    Also Read: యాంకర్ అనసూయ పిక్స్ వైరల్.. మేకప్ లేకుండా చూసి షాక్‌లో అభిమానులు!

    చివరకు మోహన్ బాబు తాను రాసి వదిలిన సుదీర్ఘ లేఖలో కూడా ముందుగా తన గురించే చెబుతూ.. ‘నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. ‘నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయి.. కఠినంగా ఉంటాయి.. కానీ, నిజాలే ఉంటాయి. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా’ అన్నారు అంటూ ఆయన తన బిల్డప్ మాటలతోనే తన లేఖను స్టార్ట్ చేశారు.

    ఏది ఏమైనా మోహన్ బాబు, కళ్యాణ్ చెప్పినట్టు చేస్తే.. తాను కోతల రాయుడిని కాదు పెదరాయుడిని అని నిరూపించుకున్నట్లే. మరి కోతల రాయుడు పెదరాయుడు అవుతాడా ?

    Also Read: మీ బోడి పెద్దరికం ఎవరడిగారు? చిరంజీవిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

    Tags