Omicron: కరోనా రక్కసి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరిగి ఒమిక్రాన్ వేరియంట్ ను ఆహ్వానించారు. దీంతో నిన్న ఒక్క రోజే పది లక్షలకు పైగా కేసులు వెలుగు చూడటం గమనార్హం. ఫలితంగా అమెరికా వణుకుతోంది. కరోనా ప్రభావంతో కకావికలం అవుతోంది. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
గురువారం ఒక్క రోజే 5.91 లక్షల కేసులు నమోదు కాగా ప్రస్తుతం అవి రెట్టింపు కావడంతో జనం కలవరపాటుకు గురవుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం ఏ మేరకు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఆంక్షలు కూడా లేకపోవడంతోనే కేసుల సంఖ్య ఇలా పెరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: యాంకర్ అనసూయ పిక్స్ వైరల్.. మేకప్ లేకుండా చూసి షాక్‌లో అభిమానులు!
ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. ఐసీయూలోనే దాదాపు 18 వేల మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావానికి ఐరోపా దేశాలన్ని ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నా మహమ్మారి బారిన పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
మూడో దశలో చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని శాస్ర్తవేత్తలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రతి రోజు 500 కంటే ఎక్కువ మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో 5-11 మధ్య వయసులో ఉన్న వారికి టీకా వేసేందుకు అమెరికా సిద్ధమైనట్లు సమాచారం. అమెరికా కరోనా రక్కసిని రూపుమాపే క్రమంలో ఇంకా ఏం చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: మీ బోడి పెద్దరికం ఎవరడిగారు? చిరంజీవిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి