Shruti Haasan Comments On Parents: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో శృతి హాసన్(Shruti Haasan) పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె కమల్ హాసన్(Kamal Haasan) కుమార్తెగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది కానీ, తన సొంత టాలెంట్ మీదనే ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఈమె అద్భుతంగా నటించగలదు, డ్యాన్స్ వేయగలదు, పాటలు కూడా పాడగలదు. తండ్రికి తగ్గ తనయురాలు అని చెప్పడానికి ఇంతకు మించిన బెస్ట్ ఉదాహరణ మరొకటి ఏమి ఉంటుంది చెప్పండి. అంతే కాదు శృతి హాసన్ ఆలోచనలు కూడా చాలా అప్డేట్ గా ఉంటుంది. దేనిని అయిన ప్రాక్టికల్ గా తీసుకొని మాట్లాడడం ఆమెకు అలవాటు. రీసెంట్ గా సోషల్ మీడియా లో తన తల్లి శారికా, తండ్రి కమల్ హాసన్ విడిపోయిన ఘటన ని గుర్తు చేసుకుంటూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను చిన్నతనం లో ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు విడిపోయారు కాబట్టి నాకు పెద్దగా బాధలేదు. కలిసి సంతోషం గా ఉండలేనప్పుడు,ఒకే ఇంట్లో ఉంటూ, ఇబ్బంది పడుతూ, ఎడమొహం పెడమొహం వేసుకొని విడి విడిగా ఉంటూ కష్టాలు పడడం కంటే విడిపోవడమే బెస్ట్ కదా. వాళ్లిద్దరూ వాళ్లకు ఉన్న కారణాల చేత విడిపోయారు. వాళ్ళ నిర్ణయానికి నేను గౌరవం ఇస్తాను. కానీ మా అమ్మ శారికా నుండి మాత్రం నేను చాలా నేర్చుకున్నాను. విడాకులు తీసుకున్న ఒక మహిళ ధైర్యం గా, ఆత్మవిశ్వాసంతో, ఒకరి మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడడం ఎలాగో మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఆమెలో ఉన్న ఈ లక్షణాలు నన్ను జీవితంలో స్వతంత్రం గా ఎలా బ్రతకాలో నేర్పించింది. మా తల్లిదండ్రులతో నాకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. వాళ్ళు విడిపోయినప్పటికీ కూడా ఈనాడు తమ ప్రేమకు దూరం చేయలేదు’ అంటూ సోషల్ మీడియా లో ఈ విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ఈమధ్య కాలం లో ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈమె రవితేజ తో కిక్, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్, ప్రభాస్ తో సలార్, మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ తో వీరసింహా రెడ్డి వంటి చిత్రాలు చేసింది. ఈ సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకించి చెప్పాలా చెప్పండి?, అన్నీ ఒక దానిని మించి ఒకటి హిట్ అవుతూ వచ్చాయి. అలా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న శృతి హాసన్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కి కూడా హిట్ కల కనిపిస్తుంది.