Koratala Siva: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివకి టైం కలిసి రావడం లేదు. ఆచార్య ఆయన్ని వదలడం లేదు. మూడేళ్లుగా ఆచార్య ప్రాజెక్ట్ ముప్పతిప్పలు పెడుతుంది. ఆచార్య విడుదల చేసి కొత్త ప్రాజెక్ట్ పనులు చూసుకుందాం అంటే కుదరడం లేదు. కొరటాల శివ చివరి చిత్రం భరత్ అనే నేను. ఈ మూవీ 2018లో విడుదలైంది. భరత్ అనే నేను సూపర్ సక్సెస్ కాగా.. ఆ జోష్ లో చిరంజీవితో ఆచార్య ప్రకటించారు.
పలు కారణాల చేత ఆచార్య సెట్స్ పైకి వెళ్లడానికి సమయం తీసుకుంది. హీరో చిరంజీవి కావడంతో చేసేదేమీ లేక సహనంగా ఎదురుచూశాడు. ఇక చిరుకి మూడొచ్చి షూటింగ్ కి సిద్ధం అయ్యాక.. కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో దాదాపు ఏడాది సమయం కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఒకసారి చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఆయన కోలుకున్నాక సెకండ్ వేవ్ రావడం జరిగింది.
Also Read: ఫాఫం.. ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఇలా తయారైందేంటి?
మరోవైపు ఆచార్య మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తయ్యాక రీ షూట్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆచార్య విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు చెప్పిన చిత్ర బృందం.. దానికి ఏప్రిల్ 1కి మార్చారు. అదే రోజూ సర్కారు వారి పాట విడుదల తేదీగా ఉంది. మరి ఏప్రిల్ కైనా ఆచార్య విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.
కారణం చిరంజీవి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఎంతో కొంత మేర చిరంజీవి కారణం ఆచార్య పనులు వాయిదా పడతాయి. మరోవైపు కొరటాల ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. ఆచార్య విడుదల చేసి ఎన్టీఆర్ మూవీ పనులు చూసుకుందాం అనుకుంటున్నా కొరటాలకు అనుకోని అవరోధాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆచార్య ఒప్పుకున్న వేళా విశేషం ఏమిటో కానీ, ప్రాజెక్ట్ కి శుభం కార్డు పడడం లేదు.
ఆచార్య ఏప్రిల్ లో విడుదల కాని పక్షంలో ఎన్టీఆర్ సినిమా మరింత ఆలస్యం అవుతుంది. అలాగే ఆచార్య విడుదలకు కరోనా పరిస్థితులు కూడా సహకరించాలి. చూద్దాం మరి ఆచార్య ఎప్పుడు థియేటర్స్ లో దిగుతాడో…
Also Read:‘అల వైకుంఠపురములో’.. బోలెడు లొసుగులు !