(Shilpa Shetty): మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టికి ఊరట దక్కింది. ఆమెపై నమోదైన అశ్లీలత కేసును ముంబై కోర్టు కొట్టేసింది. 2007లో రాజస్థాన్‌లో ఎయిడ్స్‌పై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బుగ్గపై హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ముద్దుపెట్టాడు. దీంతో అశ్లీలతను ప్రొత్సహించిందంటూ శిల్పపై కేసు నమోదు కాగా.. రిచర్డ్ చర్యకు శిల్పానే అసలు బాధితురాలని చెబుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. మొత్తమ్మీద ఈ ముద్దు కేసులో శిల్పాశెట్టికి ఊరట లభించింది.
(Amitabh) ఇక మరో మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ విషెస్ చెబుతోంటే, అందరికంటే భిన్నంగా ఉండాలని బిగ్ బీ అమితాబ్ యత్నించారు. ఈక్రమంలో తన పిల్లిగడ్డానికి త్రివర్ణ రంగు వేయించుకొని ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అని మెసేజ్ కూడా పెట్టారు. చాలామంది అమితాబ్ చతురతకు ఫిదా అయితే, కొంతమంది ఇది అవమానకరంగా ఉందన్నారు.
Also Read: ఫాఫం.. ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఇలా తయారైందేంటి?
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగు సినిమాలో నటించడానికి రెడీ అంటుంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పూరి లైగర్ సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత పూరి మళ్లీ విజయ్ దేవరకొండతోనే మరో సినిమా చేస్తున్నాడట. కాగా ఆ సినిమాలో విజయ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ తీసుకోబోతున్నారట.
అన్నట్టు జాన్వీ కపూర్ కి విజయ్ దేవరకొండ అంటే అభిమానం అట. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ తో కలిసి నటించాలని ఉందని అభిప్రాయం వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read: ‘కొండా’తో వర్మ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ బాగానే ఉంది !