Dhanush: కరోనా సినిమా వాళ్లకు భారీ సినిమానే చూపిస్తోంది. సహజంగా హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా వాళ్ళ పై టాక్ చేస్తూనే ఉంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే మరో హీరో శ్రీకాంత్ కి కూడా పాజిటివ్ అని వచ్చింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోకి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది.

తమిళ స్టార్ హీరో ధనుష్‌కి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ధనుష్ కి కరోనా అని అధికారికంగా ఈ విషయం తెలుపకపోయినా, తాజాగా ధనుష్ నటిస్తున్న తెలుగు చిత్రం ‘సార్’ షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. ఇటీవలే ఆయన సోదరుడు కరోనా బారిన పడగా, సెట్ లో కూడా కొందరు టెక్నీషియన్స్‌కి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ధనుష్ క్వారంటైన్‌లో ఉన్నారట.
Also Read: మూవీ టైమ్ : బాలీవుడ్ టుడే క్రేజీ అప్ డేట్స్ !
ఇక ధనుష్ కి స్వల్ప లక్షణాలున్నాయని సమాచారం. ఓ పది రోజులపాటు ధనుష్ చిత్రీకరణకు దూరం కానున్నారు. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని హీరోలు విజ్ఞప్తిచేస్తున్నారు. నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరే వినిపిస్తోంది.

మొత్తం ఇండస్ట్రీ కరోనా మయం అయిపోయేలా ఉంది. సినిమా షూటింగ్ స్పాట్ లో కరోనా కేసులు వస్తే.. అక్కడ ఉన్న అందరికీ చాలా ఈజీగా కరోనా సోకే అవకాశం ఉంది. అందుకే, ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు తమ షూటింగ్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు.
Also Read: భారత రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
[…] Bangarraju: అక్కినేని నాగార్జున – నాగచైతన్య కలయికలో వచ్చిన ‘బంగార్రాజు’ భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టలేక పోయినా ఓ కోణంలో మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్11 రోజులు అవుతున్నా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో ‘బంగార్రాజు’ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది. సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే, ఫస్ట్ డే నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. మరి లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. […]