https://oktelugu.com/

Mahesh Babu: మహేశ్ బాబుకు నచ్చని ఆయన సినిమా ఏంటో తెలుసా?

Mahesh Babu: తెలుగు సినిమాల్లో అప్పట్లో అందాల నటుడు అంటే శోభన్ బాబు పేరు చెప్పేవారు. ఇప్పుడు ఎవరంటే మహేశ్ బాబు పేరు చెబుతున్నారు. చూడ్డానికి అలా ఉంటాడు. వయసు 40 పైనే అయినా 20 లాగే కనిపిస్తాడు. దీంతో మహేశ్ బాబును తమ కలల రాకుమారుడిలా ఆరాధిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగి నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం ఆయన స్టైల్ ను […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 29, 2022 / 08:31 AM IST
    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమాల్లో అప్పట్లో అందాల నటుడు అంటే శోభన్ బాబు పేరు చెప్పేవారు. ఇప్పుడు ఎవరంటే మహేశ్ బాబు పేరు చెబుతున్నారు. చూడ్డానికి అలా ఉంటాడు. వయసు 40 పైనే అయినా 20 లాగే కనిపిస్తాడు. దీంతో మహేశ్ బాబును తమ కలల రాకుమారుడిలా ఆరాధిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగి నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం ఆయన స్టైల్ ను అనుకరిస్తారు. సైలెంట్ గా డైలాగులు చెబుతూ కుర్ర కారు గుండెల్ని పిండేసే నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

    Mahesh Babu

    చేసిన సినిమాకు వంద శాతం న్యాయం చేయాలని చూస్తుంటాడు అందుకే తన చిత్రాలు దాదాపుగా ప్లాఫ్ కాకూడదనే భావిస్తుంటాడు. అయినా కొన్ని మన అంచనాలను చేరుకోవు. అయినా కుంగిపోకుండా వరుసగా చిత్రాలు చేస్తూ తన సత్తా చాటడం ఆయనకు అలవాటే. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే మహేశ్ బాబుకు అప్పుడప్పుడు అపజయాలు పలకరిస్తూనే ఉంటాయి. అయినా ధైర్యం కోల్పోడు. మళ్లీ అంతకు రెట్టించిన కసితో సినిమాలు చేసి సక్సెస్ కు బాటలు వేస్తుంటాడు

    Also Read: Analysis on YCP vs Janasena : జనసేనతో పెట్టుకుంటే అంతేమరీ

    ఇంతకీ మహేశ్ బాబు చేసిన చిత్రాల్లో చాలా వరకు విజయవంతమైనా కొన్ని అపజయాలను చవిచూశాయి. అందులో మహేశ్ బాబును చాలా నిరాశ పరచిన చిత్రాల్లో సైనికుడు కూడా ఒకటి. ఆ సినిమాపై మహేశ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నా అది బెడిసికొట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా వచ్చిన చిత్రం. ఇందులో ఎక్కువగా త్రిష పైనే ఫోకస్ చేశారనే వాదన కూడా ఉంది. పైగా మహేశ్ బాబును విలన్ గా చూపించారనే టాక్ కూడా వచ్చింది.

    Mahesh Babu

    అయితే అప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు విజయవంతం కావడంతో మహేశ్ కెరీర్ ఎక్కడికో వెళ్లింది దీంతో సైనికుడు కూడా మంచి కథ కావడంతో ఒప్పుకున్నాడు కానీ ఆ కథ వారి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. దీంతో మహేశ్ బాగా కుంగిపోయినా తరువాత చిత్రాల కోసం మళ్లీ ఊపు తెచ్చుకున్నాడు. మనం ఎన్నో ఊహించుకున్న కొన్ని బెడిసికొడతాయి. ఏ అంచనాలు లేకుండా చేసిన కొన్ని సక్సెస్ అవుతాయి. అందులో సందేహం లేదు. మొత్తానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కష్టాలు వచ్చాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడమే మన ముందున్న కర్తవ్యం.

    ప్రస్తుతం పరశురాం దర్శకత్వలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానుంది. దీంతో మహేశ్ బాబు మరోసారి తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు సమాచారం. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ ఓ విచిత్రమైన వేదిక. ఇక్కడ కొన్ని అద్భుతాలు మరికొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి.

    Also Read:RRR: లేటెస్ట్ కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్లో తెలిస్తే షాకే !

    Recommended Videos:

    Tags