Koratala Siva- NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరక్టర్ల లో కొరటాల శివ ఒకరు ఈయన మొదట ఇండస్ట్రీ కి రైటర్ గా వచ్చి ఆ తర్వాత మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిన విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడం తో సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీయార్ తో జనతా గ్యారేజ్ అనే సినిమా తీశాడు.ఇక ఈ సినిమా తర్వాత భరత్ అనే నేను సినిమా చేశాడు ఈ సినిమా మంచి విజయం సాధించింది…దాంతో చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా ప్లాప్ అయ్యింది ఇక ఇప్పుడు ఎన్టీయార్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో ఎలాగైనా ఒక భారీ హిట్ కొట్టాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది నిజానికి ఈ సినిమా సక్సెస్ మీదనే ఆయన తర్వాత చేయబోయే సినిమాలు ఆధారపడి ఉంటాయి.
అందుకే ఈ సినిమాతో తనని తను ప్రూవ్ చేసుకొని పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది… ఇక ఈ సినిమా సక్సెస్ సాధించడం అనేది కొరటాలకే కాకుండా ఎన్టీయార్ కి కూడా చాలా అవసరం ఎందుకంటే ఆయన అర్అర్అర్ సినిమాతో పాన్ వరల్డ్ హీరో గా పేరు సంపాదించినప్పటికీ దాంట్లో ఇద్దరు హీరోలు ఉండటం తో క్రెడిట్ ఇద్దరికీ వస్తుంది. అలా కాకుండా ఆయనకి సోలో గా ఒక మంచి హిట్ కావాలి కాబట్టి ఈ సినిమా మీదనే ఆయన కూడా చాలా హోప్స్ పెట్టుకున్నట్లు గా తెలుస్తుంది…
ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో టాప్ లోకి వెళ్ళిపోతారు లేకపోతే మాత్రం కొరటాల మార్కెట్ ఎన్టీయార్ మార్కెట్ ఇద్దరిదీ కూడా చాలా వరకు తగ్గిపోతుందనే చెప్పాలి…ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం మన తెలుగు హీరోల్లో ఒకరైన ఒక యంగ్ హీరో నటించబోతున్నట్లు గా తెలుస్తుంది… ఇక ఈ సినిమా లో ఆ పాత్ర చాలా సస్పెన్స్ గా ఉంటుందట అందుకే ఆ పాత్ర ని కూడా చాలా రహస్యం గా ఉంచుతున్నట్లు గా తెలుస్తుంది…అయితే ఆ పాత్ర లో ఎవరు నటిస్తున్నారు అంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇందులో రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ నటిస్తున్నట్లు గా తెలుస్తుంది…ఇది సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది….విజయ్ అయితే ఇప్పటికే లైగర్ తో బాలీవుడ్ జనాలకి కూడా బాగా పరిచయం అయిన హీరో కాబట్టి ఆయనతోనే చేయించాలని ఎన్టీయార్ కొరటాల ఇద్దరు అనుకొని మరి ఆయన్ని ఒప్పించి చేయిస్తున్నారట…