Naga Chaitanya: అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో నాగార్జున తర్వాత నాగ చైతన్య గురించి చెప్పుకోవాలి. ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి అయితే ఈయన కెరియర్ లో ఎక్కువ గా ఈయన కి హిట్ ఇచ్చిన సినిమాలు ఏంటంటే ఏమాయ చేసావే, 100% లవ్ లాంటి లవ్ స్టోరీస్ తోనే ఆయన ఎక్కువగా హిట్లు అందుకున్నాడు నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు ఆయనకి ప్లాప్ లను ఇచ్చాయి ఎప్పుడైతే ఆయన ఒక లవ్ స్టోరీ చేశాడో అప్పుడే ఆయనకి మంచి హిట్లు దక్కాయి ఇక అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేసే సినిమాలు అన్ని కూడా ఇక డిఫరెంట్ గా ఉండబోతున్నాయి అని ఆయనే ఈ మధ్య ఒక ఫంక్షన్ లో చెప్పారు. ఇక నాగ చైతన్య అంటే ఒకప్పుడు సమంత నాగ చైతన్య అని పిలిచేవారు. సమంత తో విడాకులు అయ్యాక నాగచైతన్య కొంత వరకు సాడ్ ఫేస్ అయితే అనుభవించారు అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లిద్దరు చాలా రోజుల నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాక కొద్దిరోజులకే ఇలా విడాకులు తీసుకోవడం నిజంగా చాలా భాదని కల్గించే విషయం అనే చెప్పాలి… అయితే ఇద్దరు విడిపోయాక సమంత సినిమాలు ఆమె చేసుకుంటుంది, నాగ చైతన్య సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది లవ్ చేసుకుంటారు కానీ కొందరు మాత్రమే పెళ్లి చేసుకుంటారు అలాంటి వాళ్లలో జంట ఒకటి…
ఇక వీళ్ళ పర్సనల్ విషయాలు పక్కన పెడితే నాగ చైతన్య వరుసగా యంగ్ డైరక్టర్ల తో సినిమాలు కమిట్ అవుతున్నట్టు గా తెలుస్తుంది… ఇప్పటికే నందిని రెడ్డి తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్న నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి తో సినిమా చేస్తున్నాడు వీళ్ల కాంబో లో ఇప్పటికే ప్రేమమ్,సవ్య సాచి లాంటి సినిమాలు కూడా వచ్చాయి… ఇక మూడోసారి వీళ్ళ కాంబో లో సినిమా రావడం తో ఈ సినిమా మీద అందరిలో చాలా మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి… అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు కానీ ఈ కాంబో మీద మాత్రం ఇప్పటికే జనాల్లో చాలా అంచనాలు ఉన్నాయి…