https://oktelugu.com/

Samantha: చచ్చిపోతానేమో అనుకున్నా.. చైతన్య విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha: పదేళ్ల ప్రేమ వారిది.. కొన్నేళ్లు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. సినిమానే వారిని కలిపింది..ఆ సినిమానే వారిని ఇప్పుడు విడదీసింది. వెండితెరపై మొన్నటి వరకూ స్టార్ కపుల్ గా ఉన్న నాగచైతన్య-సమంత జోడి విడాకుల వ్యవహారంలో నాగచైతన్య ఇప్పటివరకూ తన బాధను పంచుకోకపోయినా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో.. పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి తన విడాకులపై సమంత స్పందించింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. […]

Written By: , Updated On : December 7, 2021 / 03:10 PM IST
Samantha Chaitanya Divorce
Follow us on

Samantha: పదేళ్ల ప్రేమ వారిది.. కొన్నేళ్లు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. సినిమానే వారిని కలిపింది..ఆ సినిమానే వారిని ఇప్పుడు విడదీసింది. వెండితెరపై మొన్నటి వరకూ స్టార్ కపుల్ గా ఉన్న నాగచైతన్య-సమంత జోడి విడాకుల వ్యవహారంలో నాగచైతన్య ఇప్పటివరకూ తన బాధను పంచుకోకపోయినా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో.. పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లగక్కుతూనే ఉంది.

Samantha

Samantha Chaitanya

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి తన విడాకులపై సమంత స్పందించింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకుల తర్వాత రెండు నెలలకు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకుల తర్వాత చాలా బలహీనంగా మారిపోయానని.. ఓ దశలో చనిపోతానేమ అనిపించిందని.. కానీ ఇప్పుడు తాను ఎంత ధృడంగా ఉన్నానో అర్థమవుతోందని సమంత చెప్పుకొచ్చింది.

జీవితంలో ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని.. అలాగే చెడ్డ రోజులు వస్తాయని.. మంచి వచ్చినప్పుడు ఓకే అని.. చెడును ఒప్పుకోకపోతే లైఫ్ ముందుకు వెళ్లదని సమంత వేదాంతం మాట్లాడింది. అయ్యిందేదో అయిపోయిందని.. కానీ మిగిలిన జీవితంలో ముందుకెళ్లాలంటే అక్కడే ఆగిపోతే కుదరదు కదా అంటూ సమంత నిర్వేదం వ్యక్తం చేసింది.

Also Read: జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​.. సమంత స్వీట్​ రియాక్షన్​

విడాకుల తర్వాత తాను కృంగిపోయి చచ్చిపోతానేమో అనే భయం కూడా వేసిందని సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ ఈరోజు తట్టుకొని నిలబడిన తీరు చూసిన తర్వాత తన మీదే తనకే గర్వంగా ఉందని సమంత చెప్పింది. ఇంత ధైర్యంగా.. ధృడంగా ఎలా ఉండగలిగానో తనకే అర్థం కాలేదని సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక చైతన్యతో పదేళ్లకు పైగా స్నేహ బంధం,, నాలుగేళ్ల వివాహ బంధం ఉందని.. అదెప్పుడూ తమ మధ్య సన్నిహితంగానే ఉంటుందని.. మీడియా, శ్రేయోభిలాషులు తమకు ప్రైవసీ ఇవ్వాలని సమంత కీలక సూచనలు చేసింది.

Also Read: జీవితంలో అదే అతి పెద్ద గుణపాఠం అంటున్న సమంత…