Homeఎంటర్టైన్మెంట్RRR Movie: ఆర్​ఆర్​ఆర్ గురించి కొమురం భీమ్​ మనవడు ఎమన్నాంటే?

RRR Movie: ఆర్​ఆర్​ఆర్ గురించి కొమురం భీమ్​ మనవడు ఎమన్నాంటే?

RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా… భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం దూకుడుగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.

ఈ సినిమాలోఅల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనుండగా.. యంగ్​ టైగర్ ఎన్టీఆర్​ గొండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాదిి సంక్రాంతి కానుకగా జనవరు 7న ఈ సినినిమా విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాపై కొమురం భీమ్ మనవడు కొమురం సోనేరావ్​ స్పందించారు. కొమురం భీమ్ పోరాటానికి సినిమా రూపం ఇవ్వడం సంతోషమని అన్నారు. రాజమౌళికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

కాగా ప్రస్తుతం ప్రమోషన్స్​లో ఫుల్​ బిజీగా ఉంది ఆర్​ఆర్​ఆర్​ టీమ్​. ఈ క్రమంలోనే నిన్న ముంబయిలో పర్యటించిన రాజమౌళి అండ్​ టీమ్​.. తాజాగా హైదరాబాద్​లో ప్రెస్​ మీట్​ నిర్వహించింది. మీడియా అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తూ.. సినిమా గురించి వివరిస్తూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్లు తిరగరాస్తుందో చూాడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular