Kalki 2898 AD : కల్కి గురించి ఈ విషయాలు తెలుసుకుని వెళ్ళండి… మూవీ చాలా మజాగా ఉంటుంది!

Kalki 2898 AD : షూటింగ్ కొరకు ఐ మ్యాక్స్ షూటింగ్ కెమెరాలు ఉపయోగించారు. యూరి అలెక్స్ 65, యారి డీఎన్ఏ లెన్స్ 65తో చిత్రీకరించారు. 6.5 రెసొల్యూషన్ అత్యంత క్వాలిటీ పిక్చర్ ఆడియన్స్ ఎంజాయ్ చేయనున్నారు.

Written By: NARESH, Updated On : June 26, 2024 9:50 pm

Kalki 2898 AD Characters

Follow us on

Kalki 2898 AD : సినిమా ప్రియులను కల్కి 2898 ఏడీ ఫీవర్ ఊపేస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులను ఒక ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయమని ఆడియన్స్ నమ్ముతున్నారు. ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి భారీ క్యాస్ట్ నటించిన కల్కి చిత్రంలో ప్రత్యేకతలు ఎన్నో. కల్కి వింతలు, విశేషాల సమాహారం. ఒక అద్భుత చిత్రం ఆవిష్కరించడం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా కష్టపడ్డారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. ఆ విశేషాలు తెలుసుకొని కల్కి చిత్రానికి వెళితే మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు.

కల్కి మూవీ బడ్జెట్ రూ. 600 కోట్ల పైమాటే. దేశంలోనే అత్యధిక ఖర్చుతో రూపొందించిన చిత్రాల్లో ఒకటి. నటీనటుల రెమ్యూనరేషన్, సెట్స్, సాంకేతిక నిపుణులు, విఎఫ్ఎక్స్ కొరకు అధిక భాగం ఖర్చు చేశారు.

దాదాపు 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్- అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్నారు. 1985లో వచ్చిన గిరాఫ్తార్ అనే హిందీ చిత్రంలో చివరిగా కమల్ హాసన్-అమితాబ్ నటించారు. ఈ మూవీలో రజినీకాంత్ సైతం నటించారు.

కల్కి మూవీలో హీరో పాత్ర భైరవ ఓ కారులో ప్రయాణం చేస్తుంది. బుజ్జి పేరుతో పిలుస్తున్న ఈ మూడు చక్రాల కారును రూ. 4 కోట్ల వ్యయంతో తయారు చేశారు. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇంజనీరింగ్ టీమ్ రూపొందించారు.

81 ఏళ్ల అమితాబ్ బచ్చన్ కీలకమైన అశ్వద్ధామ పాత్ర చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ సుప్రీమ్ యాస్మిన్ అనే ప్రతినాయకుడు పాత్ర చేస్తున్నట్లు సమాచారం. మేకప్ ఆర్టిస్ట్స్ హాలీవుడ్ కి చెందినవారు. అమితాబ్ కి మేకప్ వేయడానికి తీయడానికి 5 గంటల సమయం పట్టేది.

కల్కి కథ మూడు ప్రపంచాల నేపథ్యంలో సాగుతుంది. భవిష్యత్ లో వనరులు నశించిపోతే జీవనం ఎలా ఉంటుందో నాగ్ అశ్విన్ చూపించనున్నాడు. కాశీ, శంబాల నగరాలను కథతో ముడి పెట్టాడు. ఈ కథను నాగ్ అశ్విన్ 5 ఏళ్ళు రాశారట.

కల్కి విఎఫ్ఎక్స్ వర్క్ కొరకు హాలీవుడ్ నిపుణులు పని చేశారు. హ్యారీ పోటర్, బ్లేడ్ రన్నర్, డూన్, ఇంటర్ స్టెల్లార్ చిత్రాలకు పని చేసిన టీం కల్కిలో భాగమయ్యారు.

కల్కి టైటిల్ వెనుక పెద్ద కథే ఉంది. కల్కి ట్రైలర్ లో రాజేంద్ర ప్రసాద్ ‘ఆరు వేల సంవత్సరాల క్రితం కనిపించింది. మరలా ఆ పవర్ వచ్చిందంటే’ అని అంటాడు. 6000 నుండి 2829 తీసేస్తే 3102. అది శ్రీకృష్ణుడు తన అవతారం ముగించిన ఏడాది. మరలా శ్రీకృష్ణుడు కల్కి గా అవతరించనున్నాడని అర్థం.

షూటింగ్ కొరకు ఐ మ్యాక్స్ షూటింగ్ కెమెరాలు ఉపయోగించారు. యూరి అలెక్స్ 65, యారి డీఎన్ఏ లెన్స్ 65తో చిత్రీకరించారు. 6.5 రెసొల్యూషన్ అత్యంత క్వాలిటీ పిక్చర్ ఆడియన్స్ ఎంజాయ్ చేయనున్నారు.

ఇక నటి శోభన 18 ఏళ్ల తర్వాత తెలుగులో నటిస్తుంది. ఆమె చివరిసారి మోహన్ బాబు-మంచు విష్ణు నటించిన గేమ్(2006)చిత్రంలో శోభన నటించారు. ఇంకా చాలా విశేషాలు కల్కి మూవీలో ఉన్నాయి. తప్పకుండా మూవీ చూసి ఎంజాయ్ చేయండి.