Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Kokapet Lands: క్లిన్ కార పుట్టిన వేళా విశేషం... చిరంజీవికి వేల కోట్ల లాభం!

Chiranjeevi Kokapet Lands: క్లిన్ కార పుట్టిన వేళా విశేషం… చిరంజీవికి వేల కోట్ల లాభం!

Chiranjeevi Kokapet Lands: రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కోకాపేట భూములు వేలంపాట గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్కో ఎకరం దాదాపు 100 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఊహించలేదు. ఒక్కో ఎకరం 35 కోట్లు ధరతో వేలంపాట నిర్వహిస్తే ఊహించని రేంజ్ లో ధర పెరిగింది. హ్యాపీ రైట్స్ నియోపోలిస్, రాజ్‌పుష్ప ప్రాపర్టీస్ 3.6 ఎకరాలను రూ.362 కోట్లకు కొనుగోలు చేశాయి.

అయితే ఈ పక్రియ లో చిరంజీవి కి ఎలాంటి ప్రమేయం ఏమి లేదు. కానీ ఈ సమయంలో చిరంజీవి కి దాదాపు 2000 కోట్ల దాకా ఆస్తులు పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్ గా రామ్ చరణ్ కి ఉపాసన కు 11 ఏళ్ల తర్వాత అమ్మాయి జన్మించింది. ఆమెకు క్లీంకార అనే నామకరణం చేశారు. మనవరాలు రాకతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అప్పట్లో చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అవే మాటలు నిజమయ్యాయి. చిరంజీవి కి దాదాపు కోకాపేట లో దాదాపు 20 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆచార్య సినిమాకు సంబంధించిన సెట్స్ కూడా అక్కడే వేసి షాట్ చేశారు. ఈ ప్లేస్ లోనే మెగా స్టూడియో కట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ భూముల విలువ దాదాపు 2000 కోట్ల కు చేరినట్లు తెలుస్తుంది. ఎప్పుడో దశాబ్దం క్రితం అతి తక్కువ ధరకే ఆ భూములను చిరంజీవి కొన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అవి వేల కోట్లకు పెరగడం చూస్తుంటే చిరంజీవి ముందుచూపు కు ఒక ఉదాహరణ.

కోకాపేట లోనే పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కి కూడా దాదాపు 5 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భారీ స్థాయిలో ఇంటి నిర్మాణం చేయాలనీ ప్రభాస్ ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాదాపు 200 కోట్ల ఖర్చుతో ఆ ఇంటిని నిర్మించటానికి సిద్దమై అందుకు తగ్గ పనులు కూడా ఒక ఇంటర్నేషనల్ సంస్థ కు అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే ప్రభాస్ కు కూడా కోకాపేట లో వందల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధం ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై చిరు అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.. చిరంజీవి మరోవైపు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని తెలిసిందే. గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల పై క్లారిటీ రావాల్సి ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper