Kiskindhapuri Collection: సెప్టెంబర్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీ కి కొత్త ఊపిరి పోసింది అనే అనాలి. ఈ నెల ప్రారంభం లో ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) వంటి భారీ కమర్షియల్ హిట్ తో ట్రాక్ లోకి వచ్చిన టాలీవుడ్ కి , సెప్టెంబర్ 12 న విడుదలైన ‘మిరాయ్'(Mirai Movie), ‘కిష్కింధపురి'(Kiskindhapuri Movie) చిత్రాలు రెండు కూడా సూపర్ హిట్ టాక్స్ ని తెచ్చుకొని మన టాలీవుడ్ కి మరింత జోష్ ని నింపింది. మిరాయ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ సైలెంట్ గా చప్పుడు చేయకుండా వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హారర్ చిత్రం ‘కిష్కింధపురి’ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ‘మిరాయ్’ ఎఫెక్ట్ ఈ సినిమా మీద బలంగా పడుతుంది, ఆ కారణం చేత బాగున్న సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అవుతుందేమో అని అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
కానీ వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. కానీ రెండవ రోజు ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వరల్డ్ వైడ్ వసూళ్లతో సమానంగా తెలుగు రాష్ట్రాల నుండే వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున కోటి 80 లక్షల రూపాయిలు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా రెండు కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అలా ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఈ చిత్రం 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని, మూడవ రోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే నమోదు అవుతున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ముందస్తు సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మూడవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయట. ఇదే ట్రెండ్ ని మరో వారం రోజులు కొనసాగిస్తే బెల్లంకొండ శ్రీనివాస్ కి చాలా కాలం తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే అనుకోవచ్చు. ఆయనకు చివరి సారిగా రాక్షసుడు సినిమా ద్వారా నే సూపర్ హిట్ లభించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాగా, ‘కిష్కింధపురి’ లో కూడా ఆమెనే హీరోయిన్ అవ్వడం. బహుశా అనుపమ బెల్లంకొండ కి బాగా కలిసొచ్చిన హీరోయిన్ అని అనుకోవచ్చు.