OG Tamil Market: మరో 11 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతలా అయితే ఎదురు చూస్తున్నారో, మూవీ లవర్స్ మరియు ఇతర హీరోల అభిమానులు కూడా అంతే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా నుండి వస్తున్నా ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేస్తుంది. హాలీవుడ్ యాక్షన్ మూవీ తరహా స్టాండర్డ్స్ తో డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని తన విజన్ కి తగ్గట్టుగా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ, ఎదో ఒక గొప్ప ప్రయత్నం చేసినట్టుగా ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే తెలుస్తుంది. రీసెంట్ గా ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేసిన ఇమ్రాన్ హష్మీ కి సంబందించిన థీమ్ మ్యూజిక్ ని విడుదల చేస్తే దానికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
రేపు ఈ చిత్రం నుండి ‘గన్స్ & రోజెస్’ పాట విడుదల కాబోతుంది. ఈ పాటని కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా క్రేజీ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రోగ్రామింగ్ కోసం ఆయన కొత్తరకాల వాయిద్యాలను విదేశాల నుండి తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి ఉదాహరణగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని పరిగణలోకి తీసుకోవచ్చు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి 73 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అని, గ్రాస్ అమెరికన్ డాలర్స్ లెక్కలో చూస్తే 17 లక్షల డాలర్లను దాటిందని, ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటిందని అంటున్నారు. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఈ సినిమాకు ఓవర్సీస్ లో తమిళ ప్రేక్షకులు ఎక్కువగా ఉండే దేశాల్లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయట.
ఉదాహరణకు యూరోప్ లో అత్యధిక శాతం తమిళియన్స్ ఉంటారు. అక్కడ ఈ సినిమాకు తమిళ సినిమాల కంటే ఎక్కువగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయట. ఉదాహరణకు నెథర్లాండ్స్ లో ఇప్పటి వరకు కూలీ చిత్రానికే అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయాయి. మన టాలీవుడ్ సినిమాలు ఇక్కడ అసలు ఇప్పటి వరకు విడుదల కూడా అవ్వలేదు. కానీ ఓజీ చిత్రం ఇక్కడ కూలీ రికార్డు ని సైతం బద్దలు కొట్టేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా బెర్లిన్, పోలాండ్, మల్టా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే రేంజ్ లో ఆక్యుపెన్సీలు నమోదు అవుతున్నాయట. చూస్తుంటే ఓజీ చిత్రం మన టాలీవుడ్ కి సరికొత్త మార్కెట్ ని తీసుకొచ్చేలాగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎక్కడ దాకా ఈ సినిమా వెళ్తుంది అనేది .