Asia Cup 2025 India Vs Pakistan: క్రికెట్ పేరు చెప్తే.. అందులో చిరకాల ప్రత్యర్ధులు గుర్తుకు వస్తాయి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్ జట్లు మదిలో మెదులుతుంటాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య “బూడిద” పోరాటం హోరా హోరిగా సాగుతూ ఉంటుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ ట్రోఫీ కైనా సరే పోరాటం సాగుతూనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఈ నాలుగు జట్లు క్రికెట్ లో ఉద్వేగానికి పెద్దపీట వేస్తుంటాయి. ఉద్రేకానికి సిసలైన అర్థం చెబుతుంటాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను పక్కన పెడితే.. భారత్ , పాకిస్తాన్ విషయంలో ఒక అరుదైన రికార్డు ఇప్పటికీ ఉంది.
Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
భారత్, పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్ధులు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కాకపోతే ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మాత్రం ఈ రెండు జట్లు తలపడుతుంటాయి.. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో ఈ రెండు జట్లు ఆదివారం తలపడబోతున్నాయి. పహల్గాం దాటి తర్వాత ఈ రెండు జట్లు తొలిసారిగా పోటీ పడుతున్నాయి కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఐసీసీ నిర్వహించిన టోర్నీలను పరిశీలిస్తే భారత జట్టుదే పై చేయిగా ఉంది. ఆటగాళ్ల ప్రకారం చూసుకుంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలింగ్ పరంగా.. బ్యాటింగ్ పరంగా.. ఫీల్డింగ్ పరంగా భారత జట్టు సత్తా ఏమిటో తొలి మ్యాచ్లోనే తెలిసిపోయింది. దీంతో పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా భారత్ అదే స్థాయిలో సత్తా ప్రదర్శిస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఆసియా కప్ లో టీమిండియా కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో భారత్ అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకొని అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత శ్రీలంక ఉంది. ఆసియా కప్ నేపథ్యంలో ఇప్పుడు ఒక అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ టోర్నీ చరిత్రలో ఇంతవరకు భారత్, పాకిస్తాన్ ఫైనల్ లో ముఖాముఖి తలపడలేదు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఫైనల్ లో తలపడలేదు. గ్రూప్ దశ.. సూపర్ ఫోర్ దశ.. సెమి ఫైనల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ 19సార్లు పోటీపడ్డాయి. పది మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. ఆరింట్లో పాకిస్తాన్ గెలిచింది. మూడు మ్యాచ్లు టై అయ్యాయి. అయితే ఈసారి భారత్, పాకిస్తాన్ ఫైనల్ వెళ్తాయా.. ఒకవేళ ఫైనల్ వెళ్తే పోటీ రసవత్తరంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది.