https://oktelugu.com/

కీర్తి బ్యాడ్ సెంటిమెంట్.. కలవరపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అదేరోజు సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ ను చిత్రబృందం విడుదలచేసి సినిమాపై అంచనాలను పెంచింది. అయితే నేటి వరకు కూడా ‘సర్కారువారిపాట’ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘సర్కారువారిపాట’లో మహేష్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో కీర్తి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 09:56 AM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అదేరోజు సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ ను చిత్రబృందం విడుదలచేసి సినిమాపై అంచనాలను పెంచింది. అయితే నేటి వరకు కూడా ‘సర్కారువారిపాట’ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘సర్కారువారిపాట’లో మహేష్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో కీర్తి ఫ్యాన్స్ సంబరపడుతుండగా.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. స్టార్ హీరోల పక్కన కీర్తి సురేష్ నటించిన చిత్రాలు పెద్దగా ఆడలేదని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

    Also Read: త్రివిక్రమ్ తో స్టార్ హీరోల కలయికలు !

    కీర్తి సురేష్ టాలీవుడ్లో ‘నేను శైలజ’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్టు కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’తో కీర్తిసురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలేవి పెద్దగా హిట్టుకాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

    పవన్ సరసన ‘అజ్ఞాతవాసి’.. తమిళ విజయ్ కు జోడీగా ‘భైరవ’.. విక్రమ్ తో ‘స్వామి-2’.. సూర్య పక్కన ‘గ్యాంగ్’.. ధనుష్ తో ‘రైలు’.. మోహన్ లాల్ ‘మరక్కార్.. అరబికదలింటే సింహం’లో నటించింది. ఈ సినిమాలేవి కూడా పెద్దగా ఆడలేదు. అంతేకాకుండా ఇటీవల ఆమె నటించిన ‘మిస్ ఇండియా’.. ‘పెంగ్విన్’ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

    Also Read: ఓటీటీ వద్దు మహా ప్రభో ఆంటోన్న లెజెండరీ క్రికెటర్ !

    కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ మహేష్ సినిమాపై ఎక్కడ పడుతుందోనని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కీర్తిని ‘సర్కారువారిపాట’ నుంచి తప్పించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ సినిమాతోనైనా కీర్తి సురేష్ తనను వెంటడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!