https://oktelugu.com/

Kiran Abbavaram ‘Ka’ Movie Collections : మొదటి రోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు..2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరువగా కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రం!

మొదటి రోజు ప్రీమియర్ షోస్ నుండి 45 లక్షల రూపాయిలు వచ్చాయి. అది తీసేస్తే మొదటి రోజు కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. దీనిని బట్టి రెండవ రోజు వసూళ్లు, మొదటి రోజు కంటే ఎక్కువ. రెండు రోజులకు కలిపి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం లో కోటి 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఆ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ కి కేవలం కోటి 90 లక్షల రూపాయిలను రాబట్టాల్సి ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 03:40 PM IST

    Kiran Abbavaram 'Ka' Movie Collections

    Follow us on

    Kiran Abbavaram ‘Ka’ Movie Collections : ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’ దీపావళి కానుకగా విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కిరణ్ అబ్బవరం గత రెండు చిత్రాలకు క్లోసింగ్ లో కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. కానీ ‘క’ చిరానికి మొదటి రోజే మూడు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తో పాటుగా లక్కీ భాస్కర్,అమరన్ చిత్రాలు కూడా ఒకే రోజున విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. కానీ మిగిలిన రెండు సినిమాలకంటే ఆడియన్స్ ‘క’ చిత్రానికే ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో వార్ వన్ సైడ్ అయిపొయింది.

    మొదటి రోజు ప్రీమియర్స్ ని కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు రెండు కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి రోజు ప్రీమియర్ షోస్ నుండి 45 లక్షల రూపాయిలు వచ్చాయి. అది తీసేస్తే మొదటి రోజు కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. దీనిని బట్టి రెండవ రోజు వసూళ్లు, మొదటి రోజు కంటే ఎక్కువ. రెండు రోజులకు కలిపి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం లో కోటి 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఆ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ కి కేవలం కోటి 90 లక్షల రూపాయిలను రాబట్టాల్సి ఉంటుంది. అలాగే సీడెడ్ ప్రాంతంలో 80 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ చిత్రం, ఆంధ్ర ప్రదేశ్ లో రెండు కోట్ల 8 లక్షల రూపాయిలను రాబట్టింది.

    ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 30 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 6 కోట్ల రూపాయలకు పైగా షేర్, 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రం మాస్ సెంటర్స్ లో నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీలతో రన్ అవుతుంది. పబ్లిక్ నుండి మంచి డిమాండ్ రావడంతో నేడు 180 థియేటర్స్ ని అదనంగా యాడ్ చేసారు. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు.