https://oktelugu.com/

Lucky Bhaskar Movie 2nd Collections : లక్కీ భాస్కర్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’క’ దెబ్బ గట్టిగా పడిందిగా..మాస్ సెంటర్స్ లో ఇక కష్టమే!

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు రెండు కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. అలా రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 3:45 pm
    Lucky Bhaskar Movie 2nd Collections

    Lucky Bhaskar Movie 2nd Collections

    Follow us on

    Lucky Bhaskar Movie 2nd Collections :  మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మన టాలీవుడ్ లోకి వచ్చి నటించిన నాల్గవ చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఇంతకు ముందు ఆయన మహానటి, సీతారామం,కల్కి చిత్రాల్లో నటించాడు. ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, దుల్కర్ ని తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర చేసాయి ఈ చిత్రాలు. మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో కావడంతో ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి 28 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలా భారీ అంచనాల నడుమ ఈ దీపావళి కి విడుదలై అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం A సెంటర్స్ లో కాసుల కనకవర్షం కురిపిస్తుంది. రెండు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు రెండు కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. అలా రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు రాష్ట్రాలకు విడుదలకు ముందు 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం,బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి 9 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ లో మరో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రానుంది. A సెంటర్స్ లో అద్భుతమైన రన్ వస్తుంది కానీ, మాస్ సెంటర్స్ లో మాత్రం యావరేజ్ రేంజ్ వసూళ్లు మాత్రమే వస్తున్నాయి. కారణం మాస్ సెంటర్స్ లో ‘క’ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టడం. ఆ కారణం చేత మిగిలిన రెండు సినిమాలపై గట్టి ప్రభావం పడింది

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళ లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో కోటి 20 లక్షలు, తమిళనాడు లో 75 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ 6 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం వెర్షన్స్ కి కలిపి ఈ సినిమా 22 కోట్ల రూపాయిల గ్రాస్, 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 17 కోట్ల రూపాయిలను రాబట్టాలి. వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే కానీ, మొదటి వారంలో మాత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు.