https://oktelugu.com/

Revanth Reddy-KTR : రేవంత్‌కు సమ ఉజ్జీ కేటీఆరే… ఇద్దరు కలిసీ నడుస్తారా మరి?

తెలంగాణలో మరో ఛాలెంజ్‌ రాజకీయం మొదలైంది. మూసీ పుజరుజ్జీవ పథకం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం మూసీ వెంట పాదయత్ర చేస్తానని ప్రకటించారు. ఇందుకు కేటీఆర్‌ కూడా తన వెంట రావాలని ఛాలెంజ్‌ చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 2, 2024 / 03:20 PM IST

    Revanth Reddy-KTR

    Follow us on

    Revanth Reddy-KTR :  తెలంగాణలో ప్రస్తుతం ఛాలెంజ్‌ రాజకీయం నడుస్తోంది. మూసీ పునరుజ్జీవ కార్యక్రమం విషయంలో ఈ ఛాలెంజ్‌లు మొదలయ్యాయి. మూసీ పరీవాహకంలో ఇళ్లు కూలిస్తే బుల్డోజర్లకు అడ్డం పండుకుంటామని కేటీఆర్‌ ప్రకటించారు. బుల్డోజర్లు రెడీ.. అండ్డం పండేటోడు రావాలని రేవంత్‌ సవాల్‌ చేశారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మూసీ బాధితల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించారు. విపక్ష నేతలు కూడా తన వెంట రావొచ్చని సూచించారు. సీఎం రేవంత్‌ సవాల్‌కు విపక్ష బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సై అన్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా నిర్వహించిన ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమంలో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. నిజానికి ఆ ట్వీట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి చెప్పిన మాటలతోపాటు ఓ సందర్భంలో తాను రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానన్న విషయాన్ని హైలెట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాము కోరుకున్న అంశం హైలెట్‌ కాకపోవడంతో తర్వాత రోజు బీఆర్‌ఎస్‌ మీడియా దానిని హైలెట్‌ చేసింది. కేటీఆర్‌ పాదయాత్ర అంటూ హడావుడి చేస్తోంది.

    పాదయాత్రపై చర్చ..
    అయితే కేటీఆర్‌ చేపట్టే పాదయాత్ర రేవంత్‌రెడ్డితో కాదు.. ఆయన వేరేగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. అయితే ఎప్పటి నుంచి చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోయినా యాత్ర చేస్తారని బీఆర్‌ఎస అనుకూల మీడియా హడావుడి చేస్తోంది ఈ యాత్రను విమర్శించేవారు, స్వాగతించేవారు ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తోంది.

    రేవంత్‌కు సమ ఉజ్జీగా ఉండాలనే..
    రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో మూసీ బాధితుల సమస్యలు తెలుసుకునేందకు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం మంచిది అనే ఆలోచనలో ఉన్నారు. పాదయాత్ర చేసిన నేతలు ఎన్నికల్లో గెలుస్తారనేసెంటిమెంట్‌ ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డితా తాను సీఎం కావాలంటే పాదయాత్ర చేయడమే మేలని కేటీఆర్‌ భావిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. గతేడాది ఏపీలో నారా లోకేష్‌ పాదయాత్ర చేశారు. ఆత ర్వాత ఆయన రేంజ్, ఇమేజ్‌ మారిపోయింది. గతంలో జగన్, భట్టి విక్రమార్క, వైఎస్సార్‌ పాదయాత్రలను కూడా విశ్లేషించిన నేతలు పాదయాత్రతో పార్టీ ఇమేజ్‌ మారిపోతుందని వ్యూహకర్తలు సూచిస్తున్నారు.

    కేసీఆర్‌ ప్రజల్లోకి వచ్చాక..
    కేసీఆర్‌ జనవరి నుంచి ప్రజల్లోకి వస్తారని ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ ప్రకటించారు. అంటే.. కేటీఆర్‌ పాదయాత్ర కూడా కేసీఆర్‌ బయటకు వచ్చాకే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్‌ పార్టీ బాధ్యతలు చూసుకుంటూ.. కేటీఆర్‌ ప్రజల్లోకి పాదయాత్రగా వెళ్తారని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. తద్వారా తాను రేవంత్‌కు సమ ఉజ్జీని అని నిరూపించుకోవాలనే ఆలోచనలో కేటీఆర్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. సీఎం రేవంత్‌ను చిట్టినాయుడు అని విమర్శలుచేసినా.. ఆయన రేంజ్‌కు తాను సమంగా లేనని కేటీఆర్‌ భావిస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను బోల్తా కొట్టించాడు. ఈ నేపథ్యంలో రేవంత్‌లా ఎదగాలన్న ఆలోచనలో కేటీఆర్‌ ఉన్నట్లు చెబుతున్నారు.