Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ చూపించాడు. అదృష్టం కలిసి వచ్చి.. రెండో సినిమాకి మంచి బజ్ వచ్చింది. పైగా ఈ మధ్య కాలంలో మరో ఏ కొత్త హీరోకి ఈ స్థాయిలో బజ్ రాలేదు. ముఖ్యంగా ‘SR కళ్యాణమండపం’తో భిన్నమైన ఎమోషనల్ డ్రామా అంటూ భారీ హిట్ కొట్టాడు. కొడుకు – తండ్రిల మధ్య ఫీల్ గుడ్ డ్రామా అంటూ వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో ఆ సినిమాకి మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక చిన్న హీరోకి.. అది కూడా ఈ కరోనా కాలంలో థియేటర్స్ ఫుల్ అవ్వడం అంటే.. ఇక కిరణ్ అబ్బవరం దశ తిరిగినట్టే అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. కిరణ్ అబ్బవరం కు యాక్షన్ హీరో కావాలని కోరిక పుట్టింది.
దాంతో తన సినిమాల్లో తన పైత్యం ఇరికించడం మొదలుపెట్టాడు. అసలు స్టార్ హీరోలు ఫైట్ లు చేస్తుంటేనే జనం చూడటం లేదు. అలాంటిది ఒక కొత్త హీరో పై ఫైట్లు ఎందుకు చూస్తారు ?, ఏది ఏమైనా కిరణ్ అబ్బవరం కు వచ్చిన వరుస ఆఫర్స్ ఇప్పుడు ఎంతవరకు నిలబడతాయి అనేది డౌట్ గా మారింది. ప్రస్తుతానికి అయితే గీతా ఆర్ట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ – ఏఎం రత్నం మెగా సూర్య మూవీస్ వంటి బడా ప్రొడక్షన్ హౌసెస్ లో కిరణ్ సినిమాలు చేస్తున్నాడు.
కానీ, ‘సమ్మతమే’ చిత్రానికి వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమాల్లో ఏది ఉంటుందో ? ఏది ఊడుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హార్డ్ వర్క్ తో హీరోగా మారిన కిరణ్ కి, ఆ ఇమేజ్ అండ్ ఆ క్రేజ్ ఎక్కువ కాలం ఉండేలా లేదు. బ్యాక్ టూ బ్యాక్ రెండు పరాజయాలు పడ్డాయి. పైగా ఈ సినిమాలతో నిర్మాతలు నిండా మునిగిపోయారు. కాబట్టి.. కిరణ్ పై ఒత్తిడి పెరిగింది. కొందరు నిర్మాతలు అతనికి ఇప్పటికే దూరం జరిగారు.
నిజానికి కెరీర్ బిగినింగ్ లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పైకి వచ్చిన కిరణ్.. ఇలా తన గుర్తింపును చాలా త్వరగా పోగొట్టుకుంటాడని ఎవరు ఊహించలేదు. ‘సెబాస్టియన్ 524’ సినిమా, కిరణ్ కెరీర్ పై బాగా ప్రభావం చూపించింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ ప్లాప్ గా నిలిచింది. తాజాగా ‘సమ్మతమే’ పరిస్థితి కూడా అదే.
మొత్తానికి స్టార్ అయ్యే గొప్ప అవకాశాన్ని కిరణ్ అబ్బవరం చెడగొట్టుకున్నాడు. అదే ‘సమ్మతమే’ సినిమా ఊహించినట్టే హిట్ అయి ఉంటే.. కిరణ్ రేంజ్ మరోలా ఉండేది. కానీ సినిమా ప్లాప్ అవడంతో కిరణ్ ఊపు తగ్గింది. అతని డేట్లు కోసం ఎగబడిన నిర్మాతలు మళ్ళీ ఆలోచనలో పడ్డారు. మొత్తమ్మీద ఈ హీరో లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ప్లాప్ హీరో అనే ట్యాగ్ లైన్ ను మూటగట్టుకున్నాడు.