Alia Bhatt: ‘అలియా భట్’ బాలీవుడ్లో అగ్రతార. ఆమె ఒక సినిమాకి 8 నుంచి 12 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. హీరోయిన్లలో నెంబర్ వన్ గా ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఐతే, ఎవరైనా మిత్రులు అతిథిగా తమ సినిమాల్లో కనిపించమని కోరితే ఎక్కువ ఆలోచించకుండా ఒప్పుకుంటుంది అలియా భట్. పైగా ఖర్చులకు కూడా డబ్బులు తీసుకోదు అట. అంత మంచిది అలియా భట్ అని, ఆమె గురించి చాలా మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తూ ఉంటుంది.
తన ప్రియుడు రణబీర్ కపూర్ భారీ చిత్రం ‘బ్రహ్మస్త్ర’లో కూడా ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలో నటించింది. రణబీర్ కోసం అలియా భట్ ఒప్పుకొంది అనుకోవచ్చు. కానీ వేరే సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ చేయాల్సిన అవసరం అలియా భట్ కి లేదు. కానీ.. ఆమె తాజాగా తన గురువు షారుక్ కొత్త సినిమా ‘జవాన్’లో కూడా ఒక చిన్న పాత్ర చేయడానికి అలియా భట్ ఒప్పుకుందని తెలుస్తోంది.
Also Read: Kiran Abbavaram: లక్కీ ఛాన్స్ మిస్.. ప్లాప్ హీరోగా ట్యాగ్ లైన్.. పాపం హీరో పరిస్థితి దారుణం !
షారుక్ కాబట్టి అలియా భట్ వెంటనే అంగీకరించింది. అలియా ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో కూడా గెస్ట్ రోల్ చేస్తోంది అని వార్తలు వచ్చాయి. అది 2024లో విడుదల కానుంది. హిందీలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు కూడా వచ్చే ఏడాదే విడుదల అవుతాయి. మరోవైపు, ఇటీవల ఆమె తనకంటూ కొత్త బ్యానర్ పెట్టుకుంది. తన బ్యానర్ లో వరుస సినిమాలు చేయబోతుంది.
ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటి అయ్యారని మీడియా తల బాదుకోవడం తప్పితే.. ఈ జంట మాత్రం పెళ్లి అయిపోయే వరకు నోరెత్తలేదు. ఐతే పెళ్లి అనంతరం అలియా ‘మా వివాహం అయిపోయింది’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ ఇన్నాళ్ళకి ఒక్కటి అయ్యింది ఈ క్రేజీ జంట.
రణబీర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన అలియా.. ఇప్పుడు సంసార బంధంలో అంతకుమించి ప్రేమ ఉంటుందని చెబుతుంది. ఇక వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి క్యాష్ చేసుకున్న గాసిప్ రాయుళ్లు.. మరికొన్ని రోజుల్లో అలియా తల్లి కాబోతుంది అంటూ కొత్త పుకార్లు పుట్టించడానికి సన్నద్ధం అవుతున్నారు.