SA Vs BAN: నువ్వేం ఎంపైర్ వి రా నాయన.. సౌత్ ఆఫ్రికా దరిద్రాన్ని బంగ్లాదేశ్ పై రుద్దావు

న్యూయార్క్ వేదికగా సోమవారం బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి.. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 11:34 am

SA Vs BAN

Follow us on

SA Vs BAN: టి20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి.. అనామక జట్లు అదరగొడుతున్నాయి. పేరుపొందిన జట్లు లీగ్ దశ నుంచే నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆయా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులు టి20 క్రికెట్ కు సరికొత్త అర్ధాన్ని చెబుతున్నాయి. బాదుడుకు పర్యాయపదంగా ఉండే టి20 క్రికెట్లో వికెట్లు టపా టపా నేలకూలుతున్నాయి.. ఫలితంగా ఏ జట్టు గెలుస్తుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. సోమవారం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఇందులో ఎంపైర్ చేసిన తప్పుకు బంగ్లాదేశ్ కు ఓటమి ఎదురైతే, దక్షిణాఫ్రికాకు విజయం లభించింది.. వాస్తవానికి ఈ మ్యాచ్లో బంగ్లా జట్టు గెలవాల్సి ఉంది. ఎంపైర్ చేసిన తప్పు వల్ల ఆ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది.

న్యూయార్క్ వేదికగా సోమవారం బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి.. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాల్సి ఉండేది. కానీ ఎంపైర్ చేసిన తప్పు వల్ల ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క బంతి బంగ్లా జట్టు ఓటమిని శాసించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. హసన్ 3, తస్కన్ రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్ 46, మిల్లర్ 26 పరుగులు చేసి రాణించారు. 114 పరుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహారాజ్ (3/27), రబాడా(2/19), నోకియా (2/17) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయగలిగింది. నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తౌహీద్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. మహమ్మదుల్లా 20 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.

ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాల్సి ఉండగా.. ఎంపైర్ చేసిన తప్పు వల్ల ఆ జట్టు ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు 18 ఓవర్ వేసేందుకు దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా ముందుకు వచ్చాడు. అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి 18 బంతుల్లో 20 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజ్ లో హృదోయ్, మహమ్మదుల్లా ఉన్నారు. రబాడా వేసిన తొలి బంతికే హృదోయ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. వాస్తవానికి ఆ బంతి లెగ్ సైడ్ వెళ్తూ హృదోయ్ ప్యాడ్స్ కి తగిలి.. బౌండరిని తాకింది. దీంతో రబాడా ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. దీనికి ఎంపైర్ అవుట్ ఇచ్చాడు.

రిప్లై లో చూస్తే బంతి వికెట్లను తగిలినట్టు కనిపించడం లేదు. అంపైర్ చేసిన ఈ తప్పు వల్ల బంగ్లాదేశ్ నాలుగు పనులు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ” ఈ మ్యాచ్లో ఎంపైర్ ఇవ్వాల్సిన రెండు వైడ్లను కూడా ఇవ్వలేదు.. పైగా నన్ను తప్పుడు నిర్ణయంతో బలి ఉన్నాడని” మ్యాచ్ అనంతరం హృదోయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లా జట్టుకు ఆ పరుగులు ఇవ్వకపోవడంతోనే ఓడిపోవాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.