K Ramp Movie Talk: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఒక్క సినిమాతో సక్సెస్ ని సాధించిన స్టార్ హీరోలు సైతం ఇండస్ట్రీని శాసిస్తూ ఉండడం విశేషం… ప్రస్తుతం పాన్ ఇండియాలో ప్రభాస్ హవా ఎక్కువగా కొనసాగుతోంది. పాన్ ఇండియాలో ఆయన చాలా ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులైతే అతని కోసం ప్రాణాలైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ప్రభాస్ బాలీవుడ్ అభిమానులను ఎంతలా మెస్మరైజ్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు… అలాంటి ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలను చాలా క్లారిటీగా ఎంచుకుంటున్నాడు. ఇక ప్రభాస్ స్పూర్తి తో కుర్ర హీరోలు సైతం పాన్ ఇండియాలోకి అడుగుపెట్టారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. ఆయన ప్రస్తుతం ‘కె ర్యాంప్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తదుపరి మరికొన్ని డిఫరెంట్ సినిమాను చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కే ర్యాంప్ సినిమా టాక్ బయటకు వచ్చింది.
ఈ సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ గా ఉన్నప్పటికి మధ్యలో కొన్ని బూతు డైలాగులు అలాగే బోల్డ్ సీన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇవే ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయట. ఇక కిరణ్ అబ్బవరం సినిమాలు ఇప్పటివరకు డీసెంట్ ఫిలిమ్స్ గానే వచ్చాయి.
కానీ ఇప్పుడు కొన్ని బూతు డైలాగులను ఆడ్ చేసి సినిమాని వదలడం వల్ల ఆయన ఇమేజ్ కి కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా యూనిట్ మాత్రం ఈ సినిమాలో పెద్దగా బూతు డైలాగులేమీ లేవని, మనం నిత్య జీవితంలో వాడుకునే డైలాగులే ఉన్నాయని చెబుతుండడం విశేషం…ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
ఇక సెప్టెంబర్ 18వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాక్ అయితే బయట స్ప్రెడ్ అవుతోంది. ఇక సినిమా యూనిట్ కావాలనే టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారా? లేదంటే నిజంగానే యావరేజ్ టాక్ తోనే సరి పెట్టుకోబోతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ దీపావళికి ఆయన లక్ష్మీ బాంబు ల పేలుతాడా? లేదంటే తోక బాంబుల తుస్సు మంటాడా అనేది తెలియాల్సి ఉంది…