Bigg Boss Telugu 8 : నెల్లూరు జిల్లాలోని సగుటూరు అనే గ్రామం నుండి సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చితో హైదరాబాద్ లోకి అడుగుపెట్టిన కిరాక్ ఆర్ఫీ, నేడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ లో ఒక కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన కొన్నాళ్ళకు టీం లీడర్ గా ఎదిగాడు. ఎన్నో వందల స్కిట్స్ వేసి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్ యాజమాన్యం పద్దతి నచ్చక బయటకి వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నం చేసాడు. గ్రాండ్ గా మూవీ ని లాంచ్ చేసాడు కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అట్టకెక్కింది. ఒక పక్క జబర్దస్త్ ఆపేసాడు, మరోపక్క సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.
అలాంటి సమయంలో కిరాక్ ఆర్ఫీకి ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపలపులుసు’ అనే రెస్టారంట్ ని ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చింది. హైదరాబాద్ లో ప్రారంభించిన ఈ రెస్టారంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ లో నిల్చొని చేపల కూర కొనుక్కొని వెళ్లేవారు. అలా ఒక్క బ్రాంచ్ తో ప్రారంభమైన ఈ రెస్టారంట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. చూస్తూ ఉండగానే కోటీశ్వరుడు అయిపోయాడు కిరాక్ ఆర్ఫీ. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కిరాక్ ఆర్ఫీ కామెంట్స్ ఏ స్థాయిలో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటితనం తో మాట్లాడే కిరాక్ ఆర్ఫీ, వైసీపీ పార్టీ ని ఏకిపారేసాడు. ముఖ్యంగా రోజా మీద ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలాంటి కిరాక్ ఆర్ఫీ బిగ్ బాస్ షో లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహించుకోవడం కాదు, నిజంగానే ఆయన త్వరలో గ్రాండ్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడు. రీసెంట్ గానే ఆయన అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో పాల్గొనేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ని వారానికి 12 లక్షల రూపాయిలు డిమాండ్ చేసాడట ఆర్ఫీ.
ఆయన డిమాండ్ కి బిగ్ బాస్ టీం కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. చివరికి అతనితో భేరసారాలు ఆడి ఎట్టకేలకు వారానికి పది లక్షల రూపాయలకు ఒప్పించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే నెంబర్ 1 రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ గా యాంకర్ రవి ఉండేవాడు. ఈయనకి బిగ్ బాస్ టీం వారానికి 9 లక్షలు ఇచ్చేవారు. ఆయన బడ్జెట్ ని భరించలేక, బిగ్ బాస్ టీం ఫేక్ ఎలిమినేషన్ ద్వారా యాంకర్ రవిని 11 వ వారమే ఇంటి నుండి పంపేశారు, ఇప్పుడు కిరాక్ ఆర్ఫీ పరిస్థితి కూడా అలాగే మారబోతుందా అనేది చూడాలి.