Kingdom : వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie). జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాగవంశీ ఈ సినిమాకు నిర్మాత కావడం పెద్ధ ప్లస్ అనే చెప్పాలి. కొంతకాలం క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలా ప్రారంభం నుండి ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతూ వచ్చింది. రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. నేడు కాసేపటి క్రితమే పూర్తి స్థాయి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ స్వరపరిచిన ఈ పాట కచ్చితంగా యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
Also Read : 50 సెకండ్స్ లో భీభత్సం..సంచలనం రేపుతున్న ‘కింగ్డమ్’ మొదటి సాంగ్ ప్రోమో!
విజయ్ దేవరకొండ ని ఆడియన్స్ ఫుల్ మాస్ యాటిట్యూడ్ లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. రీసెంట్ సమయం లో అది బాగా మిస్ అయ్యింది. నేడు విడుదల చేసిన మొదటి పాట ని చూస్తే వింటేజ్ విజయ్ దేవరకొండ మాస్ యాటిట్యూడ్ మళ్ళీ బయటకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ పాటలో మొత్తం ఆయన రౌడీ యాటిట్యూడ్ తో కనిపిస్తాడు. బయట ప్రపంచానికి హీరోయిన్ భాగ్యశ్రీ తో ప్రేమలో ఉన్నట్టు నటిస్తున్నాడు. అందుకు ఎదో ఒక బలమైన కారణం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో రౌడీ ని చితకబాది భాగ్యశ్రీ ఇంటికి జీప్ లో రావడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూసేందుకు చాలా ఆసక్తి గా అనిపించింది.
అనిరుద్ అందించిన ట్యూన్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. త్వరలోనే పాట వందల కొద్దీ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ‘హృదయం లోపల’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ మొత్తం నాలుగు నిమిషాల నిడివి తో ఉండగా, దాదాపుగా నిమిషానికి పైగా హీరో హీరోయిన్ మధ్య సంభాషణ ఉండడం విశేషం. విజయ్ దేవరకొండ మార్క్ తో పాటు, డైరెక్టర్ గౌతమ్ మార్క్ కూడా స్పష్టంగా కనిపించింది. ఈ ఒక్క పాట తో ఆడియన్స్ ఈ సినిమా భారీ హిట్ అవ్వబోతుందని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవచ్చు. మే 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నుండి ప్రతీ వారం ఎదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంటుందని అంటున్నారు. వరుస డిజాస్టర్స్ తో డీలా పడిన విజయ్ దేవరకొండ ఈ సినిమా తో అవలీల గా వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతాడని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి కనీసం ఈ సినిమాతో అయినా విజయ్ కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది.
Also Read : కింగ్ డమ్ మూవీ రామ్ చరణ్ రిజెక్ట్ చేయడానికి సుకుమారే కారణమా..?
