Kingdom OTT: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాల్లో ఒకటి ‘కింగ్డమ్'(Kingdom Movie). విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ఈ సినిమా కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం తో మొదటి నుండి ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉండేవి. ఒక స్టార్ హీరో సినిమా ఎంత హైప్ తో అయితే విడుదల అవుతుందో, ఈ సినిమా కూడా అంతే హైప్ తో విడుదలైంది. హైప్ కి తగ్గట్టే ఫస్ట్ హాఫ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పింది అంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. నిర్మాత నాగవంశీ తనకు అనుకూలంగా ఉండే మీడియా తో పాజిటివ్ రివ్యూస్ ని అయితే వేయించాడు కానీ, పబ్లిక్ టాక్ ని మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోయారు.
Also Read: అక్షరాలా 400 రూపాయిల కోట్ల నష్టం..ఎన్టీఆర్ కెరీర్ లో మాయని మచ్చ ఇది!
పాజిటివ్ రివ్యూస్ కారణంగా వీకెండ్ వరకు ఒక మోస్తారు వసూళ్లను సొంతం చేసుకున్నప్పటికీ వర్కింగ్ డేస్ మొదలయ్యాక దారుణంగా పడిపోయింది. ఫలితంగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఖాతాలో మరో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం. 57 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకు, కేవలం 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. పబ్లిక్ మౌత్ టాక్ ని చూసి థియేటర్స్ కి వెళ్లని ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి మూవీ లవర్స్ కి ఇప్పుడు ఒక శుభవార్త. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తి అవ్వడం తో వినాయక చవితి సందర్భంగా ఆగష్టు 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ చిత్రం కచ్చితంగా ఓటీటీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.