Kingdom : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో వస్తున్న కింగ్ డమ్(Kingdom) సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా టీజర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో ఒక్కసారిగా సినిమా మీద భారీ అంచనాలైతే పెరిగిపోయాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది… నిజానికి గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని మొదట రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడు. కానీ గౌతమ్ హిందీలో చేసిన జెర్సీ (Jersy) సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల అతనికి పాన్ ఇండియా మార్కెట్ పెద్దగా లేదనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సల్ చేసి బుచ్చిబాబుతో పెద్ది సినిమాని పట్టాలెక్కించినట్టుగా తెలుస్తోంది. నిజానికి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఆయన కనక సినిమా చేసి ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి ఉండేది. తద్వారా రామ్ చరణ్ కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు అయితే వచ్చేది.
Also Read : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా పరిస్థితి ఏంటి..?రిలీజ్ డేట్ మార్చారా..?
ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు కాబట్టి సినిమా సూపర్ సక్సెస్ అయినా కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి కథకి స్టార్ హీరో దొరికితే ఆ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఆ సినిమాని రిపీటెడ్ గా ఆడియన్స్ చూస్తూ భారీ కలెక్షన్స్ రావడానికి దోహదపడతారు.
మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నారు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది… గౌతం తిన్ననూరి చాలా మంచి మేకర్ అనే విషయం మనందరికి తెలిసిందే…ఆయన నాని(Nani) తో చేసిన జెర్సీ (Jersy) సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా అటు నానికి ఇటు గౌతమ్ కి చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన గౌతమ్ ఇప్పుడు చేయబోతున్న కింగ్ డమ్ (King dom) సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా వీళ్ళకు ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : 50 సెకండ్స్ లో భీభత్సం..సంచలనం రేపుతున్న ‘కింగ్డమ్’ మొదటి సాంగ్ ప్రోమో!