Kingdom: సినిమా ఇండస్ట్రీ సక్సెస్ సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని…ప్రేక్షకులు ఎలాంటి సినిమాలనైతే ఇష్టపడుతున్నారో అలాంటి కథలను రాసుకొని దానిని అత్యద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులు మాత్రమే సక్సెస్ లను సాధిస్తారు. అలాగే నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న నటులు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు…
‘పెళ్లిచూపులు’ (Pelli Chupulu) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)… ఆయన చేసిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టింది. ఇక దాంతో పాటుగా ఆయన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేయబోతున్నాయి… ఇక ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో చేస్తున్న కింగ్ డమ్ (Kingdom) సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన సాంగ్ కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈనెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అదే రోజున పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా రిలీజ్ కాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ కి పోటీగా ఈ సినిమా వస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆయన నాగవంశీ ఈ విషయంలో కొంతవరకు డైలమాలో ఉన్నాడనే చెప్పాలి. ఇక హరిహర వీరమల్లు 30వ తేదీన పక్కాగా వస్తుంది అని చెప్తే మాత్రం ఆయన తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి హరిహర వీరమల్లు సినిమా టీం ఈ విషయం పట్ల సరైన క్లారిటి ఇవ్వలేకపోతున్నారు. ఒకసారి మే 30 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ అనౌన్స్ చేసినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏ విషయం అనేది క్లారిటీగా చెబితే నాకు వంశీ తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాలా లేదంటే 30వ తేదీనే రిలీజ్ చేయాలా అనే విషయంలో క్లారిటీకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా గౌతమ్ తిన్ననూరి కి, విజయ్ దేవరకొండ కి మంచి సక్సెస్ ని సాధించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…