Prabhas rejected Rajamouli script: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన సినిమాలన్ని అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టబోతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండియాలో ఎవ్వరికి దక్కని గౌరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను కూడా టచ్ చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరు సంపాదించుకోనటువంటి గుర్తింపును దక్కించుకున్న డైరెక్టర్ కూడా రాజమౌళి నే కావడం విశేషం…ఈ స్టార్ డైరెక్టర్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Also Read: నాగార్జున కొట్టిన దెబ్బలకు ముఖం వాచిపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
అయితే ఇలాంటి రాజమౌళి ఎవరితో సినిమా చేయాలన్నా కూడా స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఒక హీరో మాత్రం ఆయన చెప్పిన కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గా తెలుస్తోంది. రాజమౌళి చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కథని మొదట ప్రభాస్ కి వినిపించారట.
ఆ కథ ప్రభాస్ కి నచ్చలేదట దాంతో ఆ సినిమాని తను చేయలేనని చెప్పేసి ఆ కథను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చూసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి లాంటి సినిమాలు వచ్చాయి.
Also Read: విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగ పెద్ద ప్లాన్..?
మొత్తానికైతే రాజమౌళి చెప్పిన కథను తిరస్కరించిన ఏకైక హీరోగా ప్రభాస్ పేరు చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. ఇప్పటికి రాజమౌళి చెప్పిన కథను రిజెక్ట్ చేసిన హీరో మరొకరు లేరు అనేది వాస్తవం…ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆయన సినిమాలో చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేయడానికైన సరే ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయన స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…