Pawan Kalyan OG viral scene: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందు దూసుకెళ్తున్నారు…ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టార్ హీరోగా మార్చడమే కాకుండా కెరియర్ మొదట్లో ఎన్నో ప్రయోగాత్మకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చేసిన ఘనత అతనికే దక్కుతోంది. ముఖ్యంగా ఆయన తన చేతుల మీద నుంచి కారులను ఎక్కించుకొని పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో చాలా ప్రతిభ కలిగిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశం దొరికిన ప్రతిసారి తన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. తను పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎం గా తన సేవలను అందిస్తున్నాడు. అయినప్పటికీ ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నింటిని ఫినిష్ చేసే పనిలో ఆయన ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షక ముందుకు వచ్చిన ఆయన సెప్టెంబర్ 25వ తేదీన ఓజి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఒకప్పుడు ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వెంకట్ ఆ మూవీతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేమీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో కొద్దిరోజుల పాటు ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకునే సీన్ ఒకటి ఉందట. అయితే వెంకట్ దానికి భయపడిపోయాడట.
డైరెక్టర్ సుజిత్ తో చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి కాలర్ పట్టుకోలేను ఆయన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ ఆయనను టచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అతని ఫ్యాన్స్ నన్ను తిడతారు అని చెప్పడంతో డైరెక్టర్ సుజీత్ మాత్రం మీరు ఏం చేస్తారో తెలియదు గాని, మీరే అన్నయ్యని ఒప్పించి కాలర్ పట్టుకోవాలి అని వెంకట్ కి చెప్పారట.
Also Read: హరిహరవీరమల్లు’ను ఇంత దారుణంగా వైసీపీ తొక్కేసిందా?
దాంతో వెంకట్ భయం భయంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అన్నయ్య నేను ఇలా మీ కలర్ పట్టుకోవాలి సీన్ లో ఉంది అని చెప్పగానే పవన్ కళ్యాణ్ ఓకే పట్టుకొండి దాంట్లో ఇబ్బంది ఏముంది అని చాలా క్యాజువల్ గా చెప్పేసారట…వెంకట్ పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వానికి మంత్రం ముగ్ధుడైపోయాడట.
ఎందుకంటే చిన్న చిన్న హీరోలు సైతం వల్ల కాలర్ పట్టుకోవాలి అనగానే కొన్ని అబ్జెక్షన్స్ అయితే చెబుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటివేమీ చెప్పకుండా సీన్ డిమాండ్ చేస్తే ఏదైనా చేయాల్సిందే అనే ధోరణిలో అతనితో వ్యవహరించాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతైనా గొప్ప వ్యక్తి అని ఆయన చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది…
