Telugu Films Overseas: సూపర్ స్టార్స్ తమ స్టార్ స్టేటస్ తో సినిమాలకు ఓపెనింగ్స్ తీసుకొచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకి అయినా ఒక ప్రేక్షకుడు టికెట్ కొనాలంటే కచ్చితంగా ఆ ప్రేక్షకుడిని ప్రమోషనల్ కంటెంట్ ఆకర్షించాలి. లేకపోతే కనీసం థియేటర్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు కూడా ప్రస్తుతం లేవు. అందుకు రీసెంట్ ఉదాహరణలు ఈ ఏడాది విడుదలైన సూపర్ స్టార్స్ సినిమాలే. #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం సంక్రాంతి పండుగకు వచ్చినప్పటికీ కూడా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు పోటీ గా వచ్చిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంచలన విజయం సాధించింది, 20 కోట్ల మార్కెట్ కూడా లేని విక్టరీ వెంకటేష్ కి ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా చేసింది.
Also Read: ‘కాంతారా 3’ లో జూనియర్ ఎన్టీఆర్..ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే!
అది కంటెంట్ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి దక్కుతున్న ఆదరణ. రీసెంట్ ఉదాహరణ కూడా తీసుకుందాం. సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Harihara Veeramallu) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడింది. మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ కొట్టాల్సిన ఈ సినిమా, నాలుగు రోజులకు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంది. క్లోజింగ్ ఈ ఏడాది విడుదలైన నాని ‘హిట్ 3’ కంటే తక్కువ ఉండేట్టు ఉంది. ఈ సినిమాకు పోటీ గా వచ్చిన ఒక యానిమేషన్ చిత్రం ఇప్పుడు సంచలనాలు నమోదు చేస్తుంది. నిన్న గాక మొన్న విడుదలైన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం కూడా ఈ యానిమేషన్ సినిమా వసూళ్ల సునామీలో కొట్టుకొనిపోయింది.
ఇలా ఊరు పేరు లేని కంటెంట్ సినిమాలు సూపర్ స్టార్స్ సినిమాలను సైతం డామినేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో కంటెంట్ లేని సినిమాలను ఆడియన్స్ అవుట్ రైట్ గా రిజెక్ట్ చేస్తున్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణలే ‘హరి హర వీరమల్లు’, ‘కింగ్డమ్’ చిత్రాలు. ఒకప్పుడు ఎంత ఫ్లాప్ అయినా కనీసం మూడు రోజుల వరకు డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యేవి. కానీ ఈ రెండు సినిమాలకు మొదటి రోజుతోనే వసూళ్లు ఆగిపోయాయి. దీనిని బట్టీ చూస్తుంటే ఒకప్పటి ఓవర్సీస్ మార్కెట్ లాగ ప్రస్తుత ఓవర్సీస్ మార్కెట్ లేదు. కంటెంట్ బాగుంటేనే ఆదరిస్తున్నారు. కాబట్టి మేకర్స్ ఇకనైనా స్టార్ హీరోల వెంట పడకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను నమ్ముకొని ముందుకు పోతే బెటర్. లేదంటే చేతులు కాల్చుకోవడానికి సిద్ధపడాలి.