Kingdom and Hari Hara Veeramallu : 2020 వ సంవత్సరం, సెప్టెంబర్ నెలలో అట్టహాసంగా మొదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ షూటింగ్, నేటితో ఎట్టకేలకు ముగిసింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసారు మేకర్స్. కేవలం కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. రేపు లేదా ఎల్లుండి ఈ చిత్రం షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు మేకర్స్. ఈ సినిమా తెరకెక్కడానికి దాదాపుగా 5 ఏళ్ళ సమయం పట్టింది. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను ఎదురుకొని, ఎట్టకేలకు నిర్మాత AM రత్నం సాహసం చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చిన మూడు రోజుల డేట్స్ ని, నెల రోజుల ముందు ఇచ్చి ఉండుంటే, ఈ చిత్రం కచ్చితంగా మే9న గ్రాండ్ గా విడుదల అయ్యుండేది. కానీ చివరి నిమిషం లో ఆయన డేట్స్ ఇచ్చి షూటింగ్ ని పూర్తి చేయడం తో, విడుదలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు.
Also Read : 50 సెకండ్స్ లో భీభత్సం..సంచలనం రేపుతున్న ‘కింగ్డమ్’ మొదటి సాంగ్ ప్రోమో!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బయ్యర్స్ ఈ చిత్రాన్ని మే30 న విడుదల చేయమని నిర్మాత రత్నం పై ఒత్తిడి తెస్తున్నారట. ఎందుకంటే సమ్మర్ చివరి రోజుల్లో కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా, ఈ చిత్రం మొదటి వారం లోనే 90 శాతం కి పైగా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రాన్ని కూడా విడుదలకు షెడ్యూల్ చేశారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే. కేవలం నాలుగు రోజుల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అన్ని ప్రాంతాల్లో బిజినెస్ ని పూర్తి చేశారు. ఈ చిత్రం కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమా వస్తుందంటే, కచ్చితంగా ‘కింగ్డమ్’ చిత్రం తప్పుకోవాల్సిందే.
అలా జరిగితే అన్ని ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఇచ్చిన డబ్బులకు వడ్డీ బయ్యర్స్ కి వాచిపోతుంది. అంతే కాకుండా ఈ తేదీ నుండి వాయిదా పడితే ఓటీటీ డీల్ ప్రైజ్ కూడా తగ్గిపోతుంది. అన్ని కలిపి దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాయిదా వెయ్యడం వల్ల జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కు నాగవంశీ అత్యంత సన్నిహితుడు కాబట్టి, ‘హరి హర వీరమల్లు’ చిత్రం వస్తే మేము తప్పుకుంటాము అంటూ ఎప్పుడో చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ చిత్రాన్ని జూన్ 12 కి వాయిదా వేసే పనిలో ఉన్నారట మేకర్స్. మరోపక్క ఇంకో రూమర్ కూడా వినిపిస్తుంది. చాలా వరకు షూటింగ్ బ్యాలన్స్ ఉండడం వల్లే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారని, ఒకవేళ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆ తేదీన రాకపోయినప్పటికీ, కింగ్డమ్ విడుదలయ్యే అవకాశం లేదంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?