Day 5 Kingdom Collection: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కచ్చితంగా కింగ్డమ్ చిత్రం విజయ్ దేవరకొండ గత మూడు చిత్రాలతో పోలిస్తే వెయ్యి రెట్లు బెటర్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కి డైరెక్టర్ ఎందుకు తడబడ్డాడో తెలియదు కానీ, సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండుంటే మాత్రం విజయ్ దేవరకొండ కం బ్యాక్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. కానీ యావరేజ్ రేంజ్ లోనే టాక్ ఉంది కాబట్టి, ఈ చిత్రం కచ్చితంగా వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని నిర్మాత నాగవంశీ చాలా బలమైన నమ్మకం పెట్టుకున్నాడు. కానీ కుదర్లేదు, రెండవ రోజు వసూళ్లు మొత్తం పడిపోయాయి, ఇక వీకెండ్ లో అయినా పుంజుకుంటుందేమో అని అనుకుంటే, వీకెండ్ లో ఇంకా దారుణంగా పడిపోయాయి.
Also Read: కొరటాల శివకు ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు..?
ఇలా ఉంటే సోమవారం నుండి ఈ సినిమాకు కనీస స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం కూడా కష్టమే అని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే అయ్యింది. సోమవారం నాడు, అనగా 5వ రోజున ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇది డిజాస్టర్ రేంజ్ అనొచ్చు. మొదటి రోజు నుండి అద్భుతమైన వసూళ్లను రాబడుతున్న ఓవర్సీస్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసింది. ఇక్కడ కూడా భారీ నష్టాలు తప్పేలా లేదట. ఓవరాల్ గా 5 వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, తెలుగు రాష్ట్రాల నుండి 5 రోజులకు కలిపి 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్+ కర్ణాటక ప్రాంతాలకు కలిపి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, బ్రేక్ ఈవెన్ మార్కు కోసం ఇంకా 15 రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాల్సి ఉందని అంటున్నారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ కి మరో భారీ షాక్..పాపం ఫ్యాన్స్
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం ఫుల్ రన్ పూర్తి అయ్యాక బయ్యర్స్ కి కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టాలు మిగిలించేలా ఉంది. విడుదలకు ముందు కచ్చితంగా ఈ చిత్రాన్ని తమిళం, హిందీ లో కూడా చేస్తామని ఆ చిత్ర నిర్మాత నాగవంశీ ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ఉన్నంత ఫేమ్, క్రేజ్ ఉంది అనేది కాదు అనలేని సత్యం. లైగర్ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ కూడా హిందీ వెర్షన్ లో పాతిక కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. అలాంటి మార్కెట్ ని ఈ ‘కింగ్డమ్’ చిత్రం మిస్ చేసుకున్నట్టే.