King Nagarjuna: సినీ పరిశ్రమలో ఎప్పటి నుండో రీమేక్స్ హవా నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వంటి చిత్ర పరిశ్రమలో హిట్ అయిన సినిమాలకు రీమేక్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది. స్టార్ హీరోలు సైతం రీమేక్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రీమేక్స్ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుండడం విశేషం. ప్రస్తుతం మాలీవుడ్ రీమేక్స్‌లో నటించడానికి మన తెలుగు హీరోలు సైతం ఇష్టపడుతున్నారు. మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్’లో నటిస్తున్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ ’ రీమేక్ ‘భీమ్లా నాయక్’లో చేస్తున్నారు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఓ మై కడవులే వంటి చిత్రాలు కూడా రీమేక్ రేస్‌లో దూసుకు వెళ్తున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా కింగ్ నాగార్జున కూడా ఇదే బాటను కొనసాగించే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. నాగార్జున కూడా ఓ మలయాళ మూవీ రీమేక్‌లో నటించబోతున్నారనే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో మలయాళంలో విడుదలైన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ‘ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో కింగ్ నాగార్జున ఉన్నట్లు సమాచారం.
కొత్తగా పెళ్లయిన దంపతుల కథ ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ని జియో బేబి డైరెక్ట్ చేశారు.ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన అమ్మాయికి ఎదురయ్యే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తన ఇష్టాలను పక్కన పెట్టేసి కుటుంబం కోసం ఎలా సర్దుకుపోయింది, తన కాపురాన్ని ఎలా తీర్చిదిద్దుకుంది అనే అంశం మీద ఈ కథ నడుస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో ఫిమేల్ క్యారెక్టర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారా లేదా నటించనున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.