https://oktelugu.com/

Bangarraju Movie: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైన నాగార్జున బంగార్రాజు టీం…

Bangarraju Movie: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. 2016 లో వచ్చిన ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ఈ సినిమా ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన కల్యాణ్‌ కృష్ణే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా బేబమ్మ కృతిశెట్టి కనిపించనుంది. కాగా, ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కరోనా […]

Written By: , Updated On : December 13, 2021 / 08:57 PM IST
Follow us on

Bangarraju Movie: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. 2016 లో వచ్చిన ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ఈ సినిమా ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన కల్యాణ్‌ కృష్ణే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా బేబమ్మ కృతిశెట్టి కనిపించనుంది. కాగా, ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అందులో భాగంగానే వరుసగా అప్డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా ‘బంగర్రాజు’ నుంచి మరో కీలకమైన అప్డేట్‌ బుధవారం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

king nagarjuna bangarraju movie team going to surprise fans by new update

ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సంగీతాభిమానులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘నాకోసం’ అనే ప్రేమగీతం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మూడో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్‌. బుధవారం ఉదయం 10.08 గంటలకు ఈ పాటకు సంబంధించి కీలకమైన అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘స్టే ట్యూన్డ్‌ టు ద కింగ్‌’ అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా రూపొందిస్తు్న్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.